Begin typing your search above and press return to search.

షారుఖ్ దాన్ని కూడా కబ్జా చేసేస్తున్నాడు

By:  Tupaki Desk   |   20 April 2016 8:47 AM GMT
షారుఖ్ దాన్ని కూడా కబ్జా చేసేస్తున్నాడు
X
బాలీవుడ్ హీరోల్లో షారుఖ్ ఖాన్‌కు ఉన్న బిజినెస్ మైండ్ ఇంకెవరికీ ఉండదు. మిగతా హీరోల్లాగా ఏదో సినిమా చేశామా.. పారితోషకం తీసుకున్నామా అన్నట్లు ఉండిపోడు షారుఖ్ ఖాన్. కొన్నేళ్ల కిందటే సొంత నిర్మాణ సంస్థను మొదలుపెట్టి వరుసగా సినిమాలు తీస్తున్నాడు. హిట్టయినా.. ఫ్లాపైనా.. ప్రతి సినిమాకూ వందల కోట్లలో ఆదాయం వచ్చేలా పక్కా ప్లానింగ్‌‌ తో బరిలోకి దిగుతుంటాడు షారుఖ్.

ఇక ఐపీఎల్ భవిష్యత్తును ముందే ఊహించి పదేళ్ల కిందటే లీగ్‌ లో ఓ జట్టును సొంతం చేసుకున్నాడు. దాని విలువ ఇప్పుడు వందల కోట్లలో ఉంది. ఇక అడ్వర్ టైజ్ మెంట్ల ద్వారా కోట్లకు కోట్లు సంపాదించొచ్చని ముందు బాలీవుడ్ హీరోలకు తెలియజెప్పింది షారుఖే. ఇక టీవీ రంగంలో రియాల్టీ షోలతోనూ షారుఖ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తన పొటెన్షియాలిటీ ఏంటో బాగా తెలిసిన షారుఖ్ మంచి మంచి ఆదాయ మార్గాల్ని ఎంచుకుని తన ఆస్తుల విలువను ఐదు వేల కోట్లు దాటించేశాడు.

ఇప్పుడు షారుఖ్ కళ్లు వెబ్ సిరీస్ కాన్సెప్ట్ మీద పడ్డాయి. హాలీవుడ్ లో వెబ్ సిరీస్‌ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ కాన్సెప్ట్ పాపులర్ అవుతోంది. అన్ని భాషల్లోనూ వెబ్ సిరీస్ ఊపందుకుంటున్నాయి. భవిష్యత్తులో వీటిదే రాజ్యం అన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు గుల్షన్ గ్రోవర్‌ తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయడానికి సన్నద్ధమవుతున్నాడు షారుఖ్. వయాకామ్ సంస్థ భాగస్వామ్యంలో ఈ వెబ్ సిరీస్‌ను షారుఖే ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ‘బ్యాడ్‌ మ్యాన్’ టైటిల్‌ తో రానున్న ఈ సిరీస్‌లో షారుక్‌ అతిథి పాత్రలో కనిపిస్తాడట.