Begin typing your search above and press return to search.

మున్నాభాయ్ ఫ్రాంఛైజీలో SRK.. హిరాణీకి క‌నిక స్క్రీన్ ప్లే..!

By:  Tupaki Desk   |   13 Dec 2020 5:00 AM GMT
మున్నాభాయ్ ఫ్రాంఛైజీలో SRK.. హిరాణీకి క‌నిక స్క్రీన్ ప్లే..!
X
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ రాజ్ కుమార్ హిరాణీ నుంచి ఓ సినిమా వ‌స్తోంది అంటే అది ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర తీస్తుందోన‌న్న డిబేట్ స్టార్ట‌వుతుంది. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక శైలి ఉంది. గ‌తంలో ఆయ‌న రూపొందించిన పీకే- సంజు- మున్నాభాయ్ సిరీస్ ఎంత‌టి సంచ‌ల‌నాలో తెలిసిన‌దే. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటూనే బాక్సాఫీస్ సంచ‌ల‌నాలుగా రికార్డులు సృష్టించాయి.

ప్రస్తుతం ఈ స్టార్ ఫిలింమేక‌ర్ తన తదుపరి మూవీ కోసం స్క్రిప్ట్ ని రెడీ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఈసారి కింగ్ ఖాన్ షారుఖ్ కోసం స్క్రిప్టు కావ‌డంతో మ‌రింత శ్ర‌ద్ధగా ప‌ని చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ మూవీకి ప్రముఖ స్క్రీన్ రైటర్ కనికా ధిల్లాన్ స్క్రీన్ ప్లే రాయడానికి హిరాణీకి సహాయం చేస్తున్నారు.

తాజాగా SRK కోసం రాజ్ కుమార్ హిరాణీ ఎలాంటి స్క్రిప్టును రెడీ చేస్తున్నారు? అన్న‌దానికి లీకులు అందాయి. ప‌ఠాన్ లాంటి సీరియ‌స్ యాక్ష‌న్ ఫిలిం చేస్తున్న షారూక్ ఆ చిత్రం పూర్తయిన తర్వాత రాజ్‌కుమార్ హిరానీ సూపర్ హిట్ `మున్నా భాయ్` ఫ్రాంచైజీ లో పార్ట్ 3లో న‌టించే వీలుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ ఈ వార్తలు ఇటీవ‌ల హిందీ మీడియా వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. రాజ్ ‌కుమార్ హిరాణీ తెర‌కెక్కించిన‌ చివరి చిత్రం `సంజు`. 2019లో రిలీజైంది. ఇది సంజయ్ దత్ బయోపిక్ .. ర‌ణ‌బీర్ టైటిల్ పాత్ర‌ను పోషించాడు. స్క్రీన్ రైట‌ర్ క‌నిక థిల్లాన్ గ‌తంలో సైజ్ జీరో.. జ‌డ్జిమెంట‌ల్ హై క్యా వంటి చిత్రాల‌కు స్క్రీన్ ప్లే అందించిన సంగ‌తి తెలిసిన‌దే.