Begin typing your search above and press return to search.
వారి మధ్య అదే ఆఖరి పుకారు కావాలంట!
By: Tupaki Desk | 3 Nov 2016 3:39 PM GMTసినిమావాళ్లకు సంబందించి గాసిప్స్ నిత్యం ఏదో ఒకమూలనుంచి అద్భుతంగా వస్తుంటాయి. ఏది వాస్తవమో, మరేది గాసిప్పో తెలియని పరిస్థితి సైతం చాలా సందర్భాల్లో ఏర్పడుతుంటుంది. వీటిలో హీరో - హీరోయిన్ల ఎఫైర్లకు సంబందించిన గాసిప్సే ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో అలాంటి గాసిప్పులను మించిన గాసిప్ బాలీవుడ్ లో ఏదైనా ఉందంటే... అది కచ్చితంగా ఖాన్ త్రయం గురించే అయ్యి ఉంటుంది! చిత్రసీమలో ఎవరు గ్రేట్ అనే విషయమై వీరి మధ్య వివాదాలు వచ్చి పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందని.. ఈ విషయంలో ఆమిర్ ఖాన్ అయితే ఏకంగా తన కుక్కపిల్లకు షారుక్ అని పేరు పెట్టాడన్న గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తల సంగతి పక్కన పెడితే... తాజాగా వీరి మధ్య మైత్రి బలపడుతోందని వార్తలొస్తున్నాయి. అప్పట్లో ఉన్నన్ని విబేధాలు వీరి మధ్య ప్రస్తుతం లేవని తాజా పరిణామాలు రుజువుచేస్తున్నాయి.
ఈ క్రమంలో ఇటీవలి పలు సందర్భాల్లో షారుక్ - సల్మాన్ కలిసి కనిపించగా... దీపావళి పండగకు షారుక్ ను ఇంటికి ఆహ్వానించి మరీ ఎంజాయ్ చేశాడు ఆమీర్. దీంతో ఖాన్ ల మధ్య మైత్రి బలపడుతోందని బీటౌన్ జనాలు చెప్పుకుంటున్నారు. ఈ మాటలకు మరింత బలం చేకూర్చుతూ... షారుక్ తాజాగా సల్మాన్ గురించి ఓ సరదా వ్యాఖ్య చేశాడు. సల్మాన్ కలిసి ఉన్నప్పుడు చూసినవారెవరైనా ఇద్దరికీ సంబంధం ఉందనుకుంటారని, తాము రొమాంటిక్ రిలేషన్ షిప్ లో ఉన్నామని అనుకుంటారని, తనకు కావాల్సిందీ అదేనని తెలిపాడు. ఈ సందర్భంగా తమ మధ్య రిలేషన్ గురించి మరింతగా చెప్పిన షారుక్... "నేను సల్మాన్ ప్రేమించుకుంటున్నాం అనేదే మా ఇద్దరి మధ్య ఆఖరి పుకారు కావాలి.. ఎందుకంటే మా గురించి అన్నీ చెప్పేశారు.. ఇక మిగిలింది ఈ ఒక్కమాటే" అని అన్నాడు.
ఇదే సమయంలో సల్మాన్, ఆమీర్ లతో అనుబంధం గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు కింగ్ ఖాన్. "నేను, సల్మాన్ - ఆమిర్ లు ఎప్పుడూ సినిమా స్టార్ డం గురించి అస్సలూ మాట్లాడుకోం.. అప్పుడప్పుడూ మాత్రం ముగ్గురూ కలిసి నటిస్తే ఎలా ఉంటుంది అన్నదానిపైనే చర్చించుకుంటాం.." అని తెలిపాడు. అలాగే... "ఓసారి నేను నా కొడుకు ఆర్యన్ తో సల్మాన్ ని కలవాలని వెళ్లినప్పుడు సల్మాన్ నన్ను చూసి మనం చాలా అదృష్టవంతులమని, ఈ వయసులో మరొకరైతే రిటైర్ మెంట్ గురించి ఆలోచించేవారు కానీ మనం చాలా అదృష్టవంతులం అని చెబుతూ పద ఓ డ్రింక్ లాగించేద్దాం అని సల్లూభాయ్ అన్నట్లు చెప్పుకొచ్చాడు. అతని మాటలు వింటుంటే ఇద్దరికీ ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయనిపించిందని చెప్పిన షారుక్... అందుకే తామిద్దరం ప్రేమలో పడ్డామన్న పుకారు వస్తే బాగుంటుందనిపిస్తోందని తెలిపాడు!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/