Begin typing your search above and press return to search.

అప్పటికి ఆంటీ.. అప్పటికప్పుడు హాటీ

By:  Tupaki Desk   |   11 July 2015 12:32 PM IST
అప్పటికి ఆంటీ.. అప్పటికప్పుడు హాటీ
X
ఎప్పటికెయ్యది అప్పటికి అన్న పద్యం ఈసారికి గుర్తు చేసుకోవాల్సిందే. సందర్భాన్ని బట్టి రూపురేఖల్ని మార్చేయడం శ్రీయకి కొత్తేమీ కాదు కానీ, ఇదిగో బాలీవుడ్‌ బాబుల్ని బుట్టలో వేసేందుకు రకరకాల పన్నాగాలు పన్నుతోందిలా.

ఇంతకీ విషయం ఏమంటే.. ప్రస్తుతం శ్రీయ బాలీవుడ్‌లో ఓ క్రేజీ ప్రాజెక్టులో నటిస్తోంది. మలయాళం, తెలుగు, తమిళ్‌లో సూపర్‌హిట్‌ అయిన దృశ్యం హిందీ రీమేక్‌లో శ్రీయ నటిస్తోంది. ఇక్కడ మీనా, గౌతమి వంటి ఆంటీలు పోషించిన పాత్రని హిందీలో శ్రీయ చేస్తోంది. అక్కడ అజయ్‌దేవగన్‌కి భార్య పాత్రలో నటిస్తోంది. 32ఏళ్ల శ్రీయ ఇద్దరు బిడ్డల తల్లిగా నటిస్తోంది. అందునా కాలేజీకి వెళ్లే వయసున్న అమ్మాయికి 40ప్లస్‌ మదర్‌గా నటించి ఔరా అనిపించింది. బాగానే ఉంది. అయితే శ్రీయ ప్రమోషన్స్‌లో మాత్రం దంచి కొట్టేస్తోంది.

నిజానికి శ్రీయని ప్రమోషన్‌లో కంట్రోల్‌ చేయడం హిందీ నిర్మాతల వల్ల కావడం లేదు. ఇదిగో ఇక్కడున్న ఫోటో చూస్తే ఏమనిపిస్తోంది? అసలు ఎవరైనా ఆంటీ అనుకుంటారా? ఇపుడిపుడే టీనేజీ నుంచి మిడిలేజీలో ఎంట్రీ ఇస్తున్న చిచ్చుబుడ్డిలా కనిపించడం లేదూ? స్క్రీన్‌ మీద ఆంటీ అయినా కూడా మా శ్రీయ రియల్‌ లైఫ్‌లో హాటీ అంటూ ఆమె ఫ్యాన్స్‌ తెగ సిగ్గుల మొగ్గయిపోతున్నారు. ఆట్‌ట్‌!!!