Begin typing your search above and press return to search.

సుమ - విశ్వక్ సినిమాలకు పోటీగా శ్రీవిష్ణు 'భళా తందనాన'

By:  Tupaki Desk   |   29 April 2022 9:39 AM GMT
సుమ - విశ్వక్ సినిమాలకు పోటీగా శ్రీవిష్ణు భళా తందనాన
X
విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు.. ఇప్పుడు ''భళా తందనాన'' అనే మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.

నిజానికి 'భళా తందనాన' చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని భావించారు. అయితే 'ఆచార్య' చిత్రంతో పోటీ ఎందుకులే అని అనుకున్నారో ఏమో సినిమాని వాయిదా వేశారు. అయితే మేకర్స్ తాజాగా సరికొత్త పోస్టర్ తో కొత్త రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు.

'భళా తందనాన' సినిమాని సమ్మర్ స్పెషల్ గా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ వారంలో దూకుడుగా ప్రమోషన్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే శ్రీవిష్ణు సినిమాకు పోటీగా అదే రోజు మరో రెండు చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.

సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన 'జయమ్మ పంచాయితీ' మరియు విశ్వక్ సేన్ 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాలు మే 6వ తేదీనే విడుదల కాబోతున్నాయి. మరి ఈ మూడు చిత్రాల్లో ఏవి ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడతాయో చూడాలి.

''భళా తందనాన'' చిత్రాన్ని సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఇప్పటి వరకూ వచ్చిన రెండు పాటల లిరికల్ వీడియోకు మరియు టీజర్ కు మంచి స్పందన వచ్చింది.

కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ గా రూపొందిన ఈ చిత్రంలో కేథరిన్‌ ట్రెసా కథానాయికగా నటించింది. 'కేజీఎఫ్' ఫేమ్ గరుడ రామచంద్రరాజు విలన్ గా కనిపించనున్నారు. శ్రీనివాస్ రెడ్డి - సత్య - పోసాని కృష్ణ మురళి - అయ్యప్ప పి శర్మ - చైతన్య కృష్ణ - రవి వర్మ - శ్రీకాంత్ అయ్యంగార్ - ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

శ్రీకాంత్ విస్సా ఈ సినిమాలో సంభాషణలు రాశారు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ ఫైట్స్ కంపోజ్ చేశారు.