Begin typing your search above and press return to search.
సంక్రాంతికే డిక్టేటర్ విడుదల- శ్రీవాస్
By: Tupaki Desk | 27 Dec 2015 7:08 AM GMTసంక్రాంతి రేసు విషయంలో ఎవరికి వారు పట్టుదలతో ఉన్నారు. రిలీజ్ విషయంలో ఏ సందేహాలు అక్కర్లేదని రేసులో ఉన్న నాలుగు సినిమాల యూనిట్ల నుంచి ఒకరి తర్వాత ఒకరు క్లారిటీ ఇస్తున్నారు. మొన్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఆడియో ఫంక్షన్ లో నాగార్జున అభిమానుల మధ్య నిలుచుని ‘‘సంక్రాంతికి వస్తున్నాం.. కొడుతున్నాం’’ అంటూ క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశాడు. ఇప్పుడు ‘డిక్టేటర్’ విషయంలోనూ ఇలాంటి క్లారిటీనే వచ్చేసింది. ‘డిక్టేటర్’ డైరెక్టర్ శ్రీవాస్.. తమ సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ సంక్రాంతికే వస్తుందని స్పష్టం చేశాడు.
‘‘ఈ నెల 20న విడుదల చేసిన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్ కు జనాల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. సంక్రాంతి సందర్భంగానే సినిమాను విడుదల చేస్తున్నాం. అభిమానులు, ప్రేక్షకులు బాలయ్య బాబు సినిమా ఎలా ఉండాలనుకుంటారో ‘డిక్టేటర్’ అలాగే ఉండి అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అని చెప్పాడు శ్రీవాస్. ఇక సంక్రాంతి రేసులో ఉన్న మరో పెద్ద సినమా ‘నాన్నకు ప్రేమతో’కు సంబంధించే క్లారిటీ రావాల్సి ఉంది. ఈ రోజు (ఆదివారం) రాత్రి ఆడియో ఫంక్షన్లో ‘నాన్నకు ప్రేమతో’ రిలీజ్ డేట్ ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాను కూడా సంక్రాంతికే విడుదలవుతుందని ఆ చిత్రం నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు.