Begin typing your search above and press return to search.

శ్రీవల్లికి ఒక హిట్ కావాలి

By:  Tupaki Desk   |   7 Oct 2022 4:07 AM GMT
శ్రీవల్లికి ఒక హిట్ కావాలి
X
బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐదేళ్లు పూర్తికావస్తుంది. ఇక ఇటీవల కాలంలో అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ పెంచిన బ్యూటీలలో కూడా రష్మిక మందన్న టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. మొన్నటి వరకు పూజా హెగ్డే తో పోటీగా ఉన్న శ్రీవల్లి ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో కూడా వరుసగా ఆఫర్లు అందుకుంటూ ఉండటంతో ఆ బ్యూటీ కంటే ఎక్కువ స్థాయిలో రేట్లు పెంచేసింది. దీంతో ఇప్పుడు శ్రీవల్లిని తెలుగులో తీసుకోవాలంటే నిర్మాతలు లెక్కలు వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

అయితే అమ్మడు సక్సెస్ రేట్ మాత్రం ప్రతి ఏడాది ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. ఒక సినిమా ఫ్లాప్ అయినా వెంటనే మరొక సినిమాతో మంచి విజయాలను సొంతం చేసుకుంటుంది. ఈ ఏడాది శర్వానంద్ తో తీసిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ వెంటనే సీతారామం సినిమాతో మరో విజయాన్ని అందుకొని ఏదో ఒక రకంగా ఫామ్ లోకి అయితే వచ్చేసింది.

ఇక ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఎన్ని సినిమాలు ఉన్నా కూడా ఇప్పుడు బాలీవుడ్లో అమ్మడు మొదటి సక్సెస్ కోసం ఎంతో ఆతృత ఎదురు చూస్తుంది.

పుష్ప సినిమా ఆల్రెడీ సక్సెస్ అయినప్పటికీ సోలో హీరోయిన్ గా మాత్రం సక్సెస్ అందుకొని బాలీవుడ్లో మరిన్ని ఆఫర్లు అందుకోవాలని చూస్తోంది. అమితాబచ్చన్ తో నటించిన గుడ్ బై అనే సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ఈ సినిమాకు పెద్దగా బజ్ అయితే లేదు కానీ రష్మిక ప్రమోషన్స్ లో మాత్రం కాస్త హడావిడిగానే కనిపించింది. సినిమాలో అమితాబచ్చన్ ఉండడం ఎంత మేరకు ప్లస్ అవుతుంది అనేది విడుదల తర్వాత గాని తెలియదు. మరి రష్మిక మందన తన మొదటి హిందీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటే మాత్రం ఆ తర్వాత బాలీవుడ్ బాట కాస్త ఈజీగా మారుతుంది. ఇక పుష్ప సెకండ్ పార్ట్ కూడా బాలీవుడ్ లో భారీ స్థాయిలో విడుదల కానుంది.

అలాగే చేతిలో వారసుడు సినిమాతో పాటు రణ్ బీర్ కపూర్ ఎనిమల్ సినిమా కూడా ఉంది. ఒకవేళ ఈ సినిమా అటు ఇటు తేడా కొట్టిన కూడా ఈ బ్యూటీ కి మరో రెండు అవకాశాలతో సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.