Begin typing your search above and press return to search.

శ్రీ‌వ‌ల్లి డిమాండ్ మామూలుగా లేదుగా

By:  Tupaki Desk   |   8 Jan 2022 4:30 PM GMT
శ్రీ‌వ‌ల్లి డిమాండ్ మామూలుగా లేదుగా
X
ర‌ష్మిక మంద‌న్న‌.. ఇప్పుడు `పుష్ప‌`తో ఈ పేరు ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ మారుమ్రోగిపోతోంది. `ఛ‌లో` మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ క‌న్న‌డ సోయగం వ‌రుస క్రేజీ ఆఫ‌ర్ల‌తో టాప్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప ది రైజ్‌` ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా విడుద‌లైన ఈ చిత్రం ముందు డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది.

అయితే ఆ త‌రువాత నిదానంగా సినిమా టాక్ మారిపోయింది. బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌స్తుతం ఈ మూవీ రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ మూవీతో బ‌న్నీ పాన్ ఇండియా స్టార్ గా మార‌డంతో ఇందులో హీరోయిన్ గా న‌టించిన క్రేజీ లేడీ కూడా అదే స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఇదే ఏడాది బాలీవుడ్ లోనూ స్ట్రెయిట్ హిందీ ఫిల్మ్ తో అడుగుపెడుతున్న ర‌ష్మిక భారిగా డిమాండ్ చేయ‌డం మొద‌లుపెట్టింద‌ట‌.

`మిష‌న్ మ‌జ్ను` చిత్రంతో ర‌ష్మిక ఈ ఏడాది బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కాబోతోంది. రోనీ స్క్రూ వాలా, అమ‌ర్ బూటాలా, గ‌రిమ మెహ‌తా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇదే ఏడాది అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న `గుడ్ బై` సినిమాలోనూ న‌టిస్తోంది. ఒకే సారి రెండు క్రేజీ ఆఫ‌ర్లు... `పుష్ప‌` పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కావ‌డంతో ర‌ఫ్మిక డిమాండ్ భారీగా పెరిగిపోయింద‌ట‌.

దీంతో ఈ కూర్డ్ సోయ‌గం త‌న రెమ్యున‌రేష‌న్ ని 50 శాతం పెంచేసిన‌ట్టుగా తెలుస్తోంది. `పుష్ప‌`కు 2 కోట్లు తీసుకున్న ర‌ష్మిక త‌రువాత చిత్రాల‌కు అంత‌కు మించి డిమాండ్ చేస్తోంద‌ట‌. వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్ లు, వ‌రుస హిట్ లుతో దూసుకుపోతుండ‌టంతో ర‌స్మిక డిమాండ్ కి నిర్మాత‌లు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ర‌ష్మిక తెలుగులో శ‌ర్వానంద్ తో క‌లిసి `ఆడాళ్లు మీకు జోహార్లు` చిత్రంతో న‌టిస్తోంది. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.