Begin typing your search above and press return to search.

శ్రీవల్లి అరుదైన వంద మిలియన్‌ రికార్డ్‌.. మరే స్టార్ కు ఇది సాధ్యం కాదేమో

By:  Tupaki Desk   |   26 Jan 2022 6:30 AM GMT
శ్రీవల్లి అరుదైన వంద మిలియన్‌ రికార్డ్‌.. మరే స్టార్ కు ఇది సాధ్యం కాదేమో
X
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా రికార్డుల మోగ కంటిన్యూ అవుతూనే ఉంది. మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు అమెజాన్ లో అన్ని భాషల్లో కూడా భారీగా వ్యూస్ ను దక్కించుకుంటూ రికార్డు సృష్టించింది. ఇక పాటలు గత కొన్ని నెలలుగా రికార్డుల వేట కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. వంద మిలియన్ ల వ్యూస్ అనేది ఈమద్య కాలంలో చాలా కామన్ విషయంగా మారింది. యూట్యూబ్‌ లో తెలుగు సినిమాల పాటలు వంద మిలియన్ వ్యూస్‌ ను దక్కించుకోవడం చాలా చిన్న విషయంగా భావిస్తున్న ఈ సమయంలో శ్రీవల్లి పాట వంద మిలియన్ వ్యూస్ ను దక్కించుకోవడం అత్యంత అరుదైన రికార్డుగా నమోదు అయ్యింది. శ్రీవల్లి తెలుగు వర్షన్‌ ఇప్పటికే 130 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది. ఆ విషయం పెద్ద రికార్డ్‌ కాదు. కాని శ్రీవల్లి హిందీ వర్షన్‌ వంద మిలియన్ వ్యూస్ ను దక్కించుకోవడం అరుదైన రికార్డ్‌.

ఒక తెలుగు పాట లేదా మరేదైనా సౌత్‌ ఇండియన్ సినిమా పాట హిందీ లో డబ్ అవ్వడం.. దానికి వంద మిలియన్ ల వ్యూస్‌ రావడం అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. ఇలాంటి అరుదైన రికార్డును శ్రీవల్లి దక్కించుకోవడంతో అభిమానులు అల్లు అర్జున్‌ పుష్ప సినిమా స్థాయిని మరోసారి సోషల్‌ మీడియాలో ఆకాశమే హద్దు అన్నట్లుగా ఎత్తేస్తున్నారు. పుష్ప సినిమా లోని ప్రతి పాట కూడా సూపర్‌ హిట్‌ అయ్యింది. తెలుగు సినిమా లు ఇతర భాషల్లో సక్సెస్‌ అయినా కూడా పాటలు మాత్రం పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు చాలా తక్కువ. కాని పుష్ప సినిమాలోని ఊ అంటావా మరియు శ్రీవల్లి పాటలు హిందీలో కూడా కుమ్మేస్తున్నాయి. శ్రీవల్లి పాట ఒక్క హిందీలోనే కాకుండా అన్ని భాషల్లో కూడా భారీగా వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి. శ్రీవల్లి స్టెప్‌ కు అనూహ్య స్పందన రావడంతో చాలా మంది ప్రముఖులు ఆ స్టెప్పును ఫాలో అవుతున్నారు. అందుకే సినిమాలోని ఆ పాటను అన్ని భాషల వారు తెగ చూసేస్తున్నారు.

శ్రీవల్లి హిందీ వర్షన్‌ కు వస్తున్న స్పందన చూసి మేకర్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరే సౌత్‌ స్టార్‌ కు కూడా ఈ స్థాయి వ్యూస్ ను కేవలం పుష్ప స్టార్‌ మాత్రమే దక్కించుకున్నాడు అంటూ అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. పుష్ప సినిమా హిందీ వర్షన్ అమెజాన్ లో స్ట్రీమింగ్‌ అవుతున్నా కూడా ఇంకా థియేటర్లలో స్క్రీనింగ్‌ అవుతుంది. మొన్నటికి మొన్న ఈ సినిమా ఏకంగా పాతిక లక్షల షేర్‌ ను దక్కించుకుంది అంటూ బాలీవుడ్‌ బయ్యర్లు ప్రకటించారు. సినిమా విడుదల అయిన ఇన్ని రోజుల తర్వాత అది కూడా ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత అంత షేర్‌ అంటే అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు. అద్బుతమైన పుష్ప సినిమా ను హిందీ ప్రేక్షకులు ఓన్‌ చేసుకున్నారు. అందుకే ఈ స్థాయి లో రికార్డులు నమోదు అవుతున్నాయి. పుష్ప 2 కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.