Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ చెల్లెలు లాంటిద‌న్న ఆ హీరో

By:  Tupaki Desk   |   10 July 2017 4:54 AM GMT
ఆ హీరోయిన్ చెల్లెలు లాంటిద‌న్న ఆ హీరో
X
రీల్ లో జ‌త క‌ట్టిన భామ‌ను అక్కా.. చెల్లెలు అన్న హీరోను చూశారా? అస‌లు విన్నారా? అలాంటి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌ను చేశారు ప్ర‌ముఖ క్రికెట‌ర్‌.. ఒక‌నాటి టీమిండియా క్రికెట్ ప్లేయ‌ర్‌.. తాజాగా హీరోగా న‌టిస్తున్న శ్రీశాంత్‌. బెట్టింగ్ ఆరోప‌ణ‌ల‌తో క్రికెట్ కెరీర్‌ ను మ‌ధ్య‌లోనే పోగొట్టుకున్న ఆయ‌న తొలిసారి ఒక సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

త‌మిళం.. తెలుగు.. హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న టీమ్ 5 చిత్రంలో హీరోగా న‌టిస్తున్న శ్రీశాంత్ త‌న‌తో జ‌త క‌ట్టిన ప్ర‌ముఖ హీరోయిన్ నిక్కీ గ‌ల్రాణిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సురేశ్ గోవింద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న టీమ్ 5లో బైక్ రేస‌ర్ గా న‌టిస్తున్న శ్రీశాంత్ త‌న‌తో జ‌త క‌ట్టిన న‌టి నిక్కీ గ‌ల్రాణిని చెల్లెలు లాంటిద‌ని చెప్పారు.

త‌న‌కు ఇది మొద‌టి సినిమా అయితే.. త‌న‌తో హీరోయిన్ గా న‌టిస్తున్న నిక్కీ ఇప్ప‌టికే 25 చిత్రాల్లో న‌టించార‌ని.. అందువ‌ల్ల న‌ట‌న‌కు సంబంధించి ఆమె త‌న‌కు చాలానే నేర్పించార‌న్నారు. నిక్కీ త‌న‌కు చెల్లెలు లాంటిద‌ని.. త‌ను చిన్న‌త‌నం నుంచి త‌న‌కు తెలుస‌న్నారు. త‌మ ఫ్యామిలీలో అమ్మ‌..నాన్న‌.. చెల్లెలు.. అన్న‌య్య అంద‌రూ సినిమా రంగానికి చెందిన వారేన‌ని.. తాను మాత్రం క్రికెట్ రంగానికి వెళ్లి తిరిగి సినిమా రంగానికి వ‌చ్చిన‌ట్లుగా చెప్పారు.త‌న‌కు సినిమా.. క్రికెట్ రెండూ ఇష్ట‌మేన‌ని వ్యాఖ్యానించారు. ఏమైనా జ‌త క‌ట్టిన హీరోయిన్ ను చెల్లులు లాంటిద‌న్న హీరోగా శ్రీశాంత్ గుర్తిండిపోయే అవ‌కాశం ఎక్కువ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.