Begin typing your search above and press return to search.

#శ్రీ‌రెడ్డిలీక్స్‌.. మ‌రో టాప్ డైరెక్ట‌ర్ గుట్టు ర‌ట్టు

By:  Tupaki Desk   |   11 April 2018 7:42 AM GMT
#శ్రీ‌రెడ్డిలీక్స్‌.. మ‌రో టాప్ డైరెక్ట‌ర్ గుట్టు ర‌ట్టు
X
టాలీవుడ్ లో శ్రీ‌రెడ్డి లీక్స్ ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. టాప్ ప్రొడ్యూస‌ర్ సురేష్ బాబు కొడుకు అభిరామ్ తో చనువుగా ఉన్న ఫోటోల‌ను బ‌య‌ట‌పెట్టి... అత‌ని ప‌రువు తీసేసిన శ్రీ‌రెడ్డి... ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడితో జ‌రిపిన వాట్స‌ప్ సందేశాల‌ను స్క్రీన్ షాట్ తీసి బ‌య‌ట‌పెట్టింది. టాలీవుడ్ టాప్ త్రీ ద‌ర్శ‌కుల‌లో ఒక‌డిత‌ను అంటూ ఇన్ డైరెక్టుగా అత‌ని గురించి హింట్ కూడా ఇచ్చేసింది శ్రీ‌రెడ్డి.

ఈ ఛాట్ మెసేజ్‌ల‌ను చూస్తుంటే... స‌ద‌రు టాప్ ద‌ర్శ‌కుడు- శ్రీ‌రెడ్డిని ‘బేబీ’...‘హ‌నీ’ అంటూ ముద్దుగా పిల‌వ‌డం... ‘ఐ లైక్ యూ...’- ‘ఐ ల‌వ్ యూ’ అంటూ కాక‌ప‌ట్ట‌డం క‌నిపిస్తోంది. దానికి శ్రీ‌రెడ్డి ‘నేను మిమ్మ‌ల్ని చాలా గౌర‌విస్తాను’ అంటూ స‌మాధానం ఇచ్చింది. త‌ర్వాత ప‌ర్స‌న‌ల్ గా క‌లుద్దామ‌ని అడిగిన ఆ టాప్ డైరెక్ట‌ర్ ఏకంగా త‌న ఆఫీసుకే ర‌మ్మ‌ని ఆఫ‌ర్ ఇచ్చాడు. అంతేకాకుండా ‘నేను ఇంత‌వ‌ర‌కీ ఎప్పుడూ ఇలా ఎవ‌రితోనూ ఛాట్ చేయ‌లేదు. నువ్వు నాకు చాలా ద‌గ్గ‌రైన‌ట్టుగా అనిపిస్తోంది. అందుకే ఇలా ఛాట్ చేస్తున్నా...’ అన్నాడు. పేరు క‌నిపించ‌కుండా బ్లాక్ మార్క్ చేసినప్ప‌టికీ అత‌నెవ‌రు అనేది కొద్దిగా ఆలోచిస్తే ఇట్టే తెలిసిపోతుంది. వ‌రుసగా సూప‌ర్ హిట్లు కొడుతున్న ఓ బ‌డా డైరెక్ట‌ర్ అని ఇట్టే తెలిసిపోతోంది.

అభిరామ్ విష‌యంలో చేసినట్టుగా ఈ ద‌ర్శ‌కుడి పేరు కూడా శ్రీ‌రెడ్డి త్వ‌ర‌లోనే బ‌హిరంగంగా ప్ర‌క‌టిస్తోందేమో చూడాలి. అదే జ‌రిగితే టాలీవుడ్ లో మ‌రో పెను భూకంపం రావ‌డం ప‌క్కా. నెక్స్ట్ ఎవ‌రి పేరు బ‌య‌టికి వ‌స్తుందో అని టాలీవుడ్ అంతా ఓ ర‌క‌మైన భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించింది శ్రీ‌రెడ్డి.