Begin typing your search above and press return to search.

శిరీష్ శ్రీరస్తు.. టైటిల్ సాంగ్ భలేగుందే

By:  Tupaki Desk   |   20 July 2016 7:05 AM GMT
శిరీష్ శ్రీరస్తు.. టైటిల్ సాంగ్ భలేగుందే
X
శ్రీరస్తు.. శుభమస్తు.. గత కొంతకాలంగా అల్లు వారబ్బాయి శిరీష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. తన లుక్ తో సహా ప్రతీ యాంగిల్ లోను ఛేంజ్ చూపించేందుకు ట్రై చేస్తున్నాడు. సోలో ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది.

ఇప్పుడీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ పనులు ప్రారంభించారు. 'శ్రీరస్తు.. శుభమస్తు' అంటూ సాగే టైటిల్ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది యూనిట్. స్లో బీట్ తో సాగే డ్యుయెట్ ఇది. లిరిక్ మాత్రమే కాదు.. పిక్చరైజేషన్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. గీతా ఆర్ట్స్ నిర్మాణం కావడంతో.. కొడుకుపై పెట్టుబడి విషయంలో అల్లు అరవింద్ కాంప్రమైజ్ కాలేదనే విషయం విజువల్స్ చూస్తే అర్ధమవుతుంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో చెప్పుకోవాల్సింది శిరీష్ లుక్స్ గురించే. మొదటి రెండు సినిమాల కంటే.. ఇందులో చాలా నీట్ గా కనిపించాడు అల్లు శిరీష్.

ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి అయితే.. ఏ యాంగిల్ లోంచి చూసినా అదరగొట్టేసింది. అటు హోమ్ లీ లుక్ తోనే.. ఇటు మోడర్న్ అమ్మాయి పాత్రలో లావణ్య కనిపిస్తుంది. టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యాక.. సినిమాపై అంచనాలు మరింతగా పెరగడం ఖాయం.