Begin typing your search above and press return to search.

శిరీష్ శ్రీరస్తుకు ముహూర్తం ఫైనల్

By:  Tupaki Desk   |   16 July 2016 7:43 AM GMT
శిరీష్ శ్రీరస్తుకు ముహూర్తం ఫైనల్
X
అల్లు శిరీష్.. లావణ్య త్రిపాఠి జంటగా నటించిన మూవీ శ్రీరస్తు శుభమస్తు. సోలో ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఉంది. మరోవైపు రెండు సినిమాలు చేసినా సరైన సక్సెస్ అందుకోలేకపోయిన అల్లు శిరీష్.. మూడో మూవీతో హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. గత కొన్నాళ్లుగా ఈ మూవీ రిలీజ్ కి సంబంధించిన డేట్ పై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

సెప్టెంబర్ 16న శ్రీరస్తు శుభమస్తు చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గీతా ఆర్ట్స్ నుంచి సమాచారం అందుతోంది. ఆగస్ట్ అంతా భారీ సినిమాలతో టైట్ షెడ్యూల్ ఉండడం.. అక్టోబర్ లో దసరాని పెద్ద సినిమాలు టార్గెట్ చేసి ఉండడంతో.. మధ్యలోనే సేఫ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మధ్యనే కశ్మీర్ లో తీసిన షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవగా.. అక్కడ పాటలను చిత్రీకరించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకోగా.. త్వరలో ఆడియో లాంఛ్ కి డేట్ డిసైడ్ చేయనున్నారు. దానికి ముందే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం విశేషం. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేసిన లవ్ స్టోరీ కావడంతో.. అంచనాలు బాగానే ఉన్నాయి.