Begin typing your search above and press return to search.

శిరీష్ మూడో ఎటెంప్ట్ లో కొట్టేసాడుగా

By:  Tupaki Desk   |   24 Sep 2016 6:52 AM GMT
శిరీష్ మూడో ఎటెంప్ట్ లో కొట్టేసాడుగా
X
మొదటి రెండు సినిమాలతో హీరోగా పాస్ మార్కులు కూడా వేయించుకోలేకపోయిన అల్లు శిరీష్.. ఇప్పుడు మాత్రం సూపర్ హిట్ కొట్టేశాడు. పరుశురాద్ దర్శకత్వంలో రూపొందిన శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి చాలా ఏరియాస్ లో ఫిఫ్టీ డేస్ పోస్టర్ పడిందంటే.. ఈ మూవీ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అర్ధమవుతుంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన శ్రీరస్తు శుభమస్తు.. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర అఫీషియల్ గా హిట్ అనిపించుకుంటోంది. తన అకౌంట్ లో తొలి హిట్ వేసుకోవడం.. లావణ్య ఖాతాలో మరో హిట్ అందించడం.. తన మూవీతో తండ్రికి లాభాలు అందించగలగడం.. మెగా ఫ్యామిలీ హీరోగా సక్సెస్ సాధించడం.. ఇలా చెబితే.. శ్రీరస్తు శుభమస్తు మూవీతో శిరీష్ సాధించిన క్రెడిట్స్ చాలానే ఉన్నాయి. మొత్తం పబ్లిసిటీ ప్లస్ ప్రింట్స్ ఖర్చులతో కలుపుకుని శ్రీరస్తు శుభమస్తుకి 9 కోట్లు ఖర్చయ్యాయని అంచనా.

ఫుల్ రన్ లో థియేట్రికల్ షేర్ రూపంలో 10 కోట్ల మొత్తాన్ని వసూలు చేసిన శ్రీరస్తు.. శాటిలైట్ రూపంలో మరో 3.25 కోట్లను రాబట్టింది. మేకోవర్ నుంచి యాక్టింగ్ వరకు ఈ సినిమాలో అల్లు శిరీష్ చాలానే మారాడు. ఇప్పుడు సక్సెస్ వచ్చిన జోష్ లో.. కొత్త సినిమాను మరింత పక్కాగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు శిరీష్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/