Begin typing your search above and press return to search.

దేవదాస్ దర్శకుడి మీద మహేష్ బాధ్యత

By:  Tupaki Desk   |   9 Jun 2019 9:18 AM GMT
దేవదాస్ దర్శకుడి మీద మహేష్ బాధ్యత
X
మహేష్ బాబు మేనల్లుడు ఎంపి గల్లా జయదేవ్ వారసుడు గల్లా అశోక్ ని టాలీవుడ్ కు పరిచయం చేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కొన్ని నెలల క్రితం దిల్ రాజు నిర్మాణంలో ఓ డెబ్యూ దర్శకుడితో మొదలుపెట్టారు కానీ కొంత షూటింగ్ అయ్యాక రషెస్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నే క్యాన్సిల్ చేశారు. దీంతో అశోక్ డెబ్యూ ఇంకాస్త లేట్ అయ్యేలా ఉంది.

ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య ఈ హీరో కోసం స్క్రిప్ట్ వండే పనిలో ఉన్నట్టు సమాచారం. గత ఏడాది నాగార్జున-నానిల మల్టీ స్టారర్ దేవదాస్ తో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన శ్రీరామ్ అంతకు ముందు తీసిన శమంతకమణి-భలే మంచి రోజులతో టెక్నీషియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే అతనికే అశోక్ బాధ్యతలు అప్పజెప్పినట్టు వినికిడి మహేష్ బాబు విదేశాల నుంచి వచ్చాక సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి ముందే ఓ సిట్టింగ్ లో దీన్ని వినబోతున్నట్టు తెలిసింది.

జయదేవ్ పర్సనల్ రిక్వెస్ట్ మీద ప్రిన్స్ దీని మీద ఓ కన్నేసి ఉంచబోతున్నట్టు సమాచారం. నిర్మాత మారతారా లేక మళ్ళి దిల్ రాజు లైన్ లోకి వస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అశోక్ మాత్రం ఫిజిక్ ఇంకాస్త షేప్ అవుట్ చేసుకుని ఫైట్స్ అండ్ డాన్స్ ని మెరుగు పరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడట. మహేష్ తో బంధుత్వం ఉన్నంత మాత్రం ప్రేక్షకులు ఎగబడి చూడరు కాబట్టి శ్రీరామ్ ఆదిత్య ఇతన్ని డీల్ చేయడం అంత ఈజీ కాదు. కథ యునీక్ గా ఉండటంతో పాటు ట్రీట్మెంట్ ఫ్రెష్ గా అనిపించాలి. దీనికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ ఇంకొద్ది రోజుల్లో తెలియొచ్చు