Begin typing your search above and press return to search.

మా హీరో క‌ష్టానికి త‌గ్గ‌కుండా.. మా స్క్రిప్టు ఉంటుంది - ద‌ర్శ‌కుడు

By:  Tupaki Desk   |   4 Feb 2021 7:45 AM GMT
మా హీరో క‌ష్టానికి త‌గ్గ‌కుండా.. మా స్క్రిప్టు ఉంటుంది - ద‌ర్శ‌కుడు
X
తెలుగు సినిమాల్లో ‘డూప్‌’లకు దాదాపుగా కాలం చెల్లింది. ఎంతటి రిస్కీ షాట్స్ అయినా హీరోలు స్వయంగా ఫేస్ చేస్తున్నారు. దానికోసం ఎంత కష్టానికైనా సిద్ధపడుతున్నారు. స్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రకైనా, ఎంతటి రిస్క్ చేయడానికైనా రెడీ అంటున్నారు. ఈ క్రమంలో ఒళ్లు హూనం చేసుకుంటున్నారు.

ఈ జాబితాలోని మంచువారబ్బాయి అలాగే కష్టపడుతున్నాడు. విష్ణు లేటెస్ట్ అప్ కమింగ్ మూవీ “డబుల్ డోస్”. దర్శకుడు శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వీరి కాంబోలో ‘ఢీ’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో కూడా అందరికీ తెలుసు. ఇన్నాళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది.

“ఢీ” భారీ హిట్ కావడంతో ఇప్పుడు రాబోతున్న చిత్రంపైనా మంచి అంచనాలు సెట్టయ్యాయి. ఇక, ఈ సినిమా కోసం హీరో మంచు విష్ణు ఏ స్థాయిలో కష్టపడుతున్నాడో ఆ మధ్య ఒక వీడియో తెలియజేసింది. ఫొటోలు కూడా విష్ణు కష్టాన్ని రివీల్ చేశాయి. ఇంతలా కష్టపడుతున్న తన హీరో కోసం ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు శ్రీనువైట్ల.

ఓ ఫొటో షేర్ చేసిన దర్శకుడు.. ‘మా సినిమా కోసం ఇంత కమిట్మెంట్ తో హార్డ్ వర్క్ చేస్తున్న హీరోకు.. అంతే స్థాయిలో స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నాం. మా సమిష్టి కృషికి ఖచ్చితంగా మంచే జరుగుతుంది’ అని తెలిపారు. అదేవిధంగా.. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు దర్శకుడు.

కాగా.. ఈ చిత్రం వీరిద్దరికీ ప్రతిష్టాత్మకంగా మారింది. సాలిడ్ హిట్ కోసం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నాడు విష్ణు. అదేవిధంగా.. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయాడు శ్రీనువైట్ల. ఇలాంటి పరిస్థితుల్లో జోడీ కట్టిన వీరిద్దరూ సూపర్ సక్సెస్ కోసం కసిగా వర్క్ చేస్తున్నారు. చూడాలి మరి.. ఎలాంటి ఫలితం వస్తుందో?!