Begin typing your search above and press return to search.
శ్రీను వైట్ల చిత్రంగా మాట్లాడాడే..
By: Tupaki Desk | 8 April 2017 6:40 PM ISTవరుసగా ఒకటికి రెండు డిజాస్టర్లు తీశాక.. ఏ దర్శకుడైనా తర్వాతి సినిమాను కచ్చితంగా హిట్ చేయాలన్న డెస్పరేషన్లో ఉంటాడు. శ్రీను వైట్ల పరిస్థితి ఇదే ఇప్పుడు. ‘ఆగడు’.. ‘బ్రూస్ లీ’ సినిమాలు తీవ్ర నిరాశకు గురి చేసిన నేపథ్యంలో ‘మిస్టర్’ వైట్లకు చాలా చాలా కీలకం. ఒకప్పుడు బడా హీరోలతోనే సినిమాలు చేసిన వైట్ల.. ఎన్నో మెట్లు తగ్గి వరుణ్ తేజ్ లాంటి అప్ కమింగ్ హీరోతో సినిమా చేయాల్సి వచ్చింది.
ఈ సినిమా ఆడకపోతే అతడి స్థాయి మరింత పడిపోతుంది. అతడి భవితవ్యం ఎలా ఉంటుందో అంచనా కూడా వేయలేం. హిట్లు మీద ఉన్నపుడు వైట్ల ప్రవర్తన కారణంగా అతడిపై ఇండస్ట్రీలో.. మీడియాలో ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడింది. దీంతో అతడు ఫ్లాప్ తీసినపుడల్లా అందరూ ఆటాడేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘మిస్టర్’ రిలీజ్ కు ముందు వైట్లలో మార్పు కనిపిస్తోంది. చాలా పద్ధతిగా.. ఒద్దికగా.. ప్లీజింగ్ గా మాట్లాడుతున్నాడు.
‘మిస్టర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ‘ఈసారి చాలా కసిగా సినిమా తీశా’.. టైపు మాటలేం మాట్లాడలేదు వైట్ల. తాను హిట్టు కొట్టి తీరాలన్న డెస్పరేషన్లో సినిమా తీయలేదని అతను చెప్పడం విశేషం. ‘‘ఈసారి హిట్టు కొట్టాల్సిందే అన్న డెస్పరేషన్లో సినిమా తీయలేదు. ప్రేక్షకుల మీద ప్రేమతో.. వాళ్ల ప్రేమ కోరుకుంటూ సినిమా తీశాను. ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నించాను’’ అన్నాడు వైట్ల. ఈ మాటలే కాదు.. ప్రి రిలీజ్ ఈవెంట్లో వైట్ల ప్రసంగమంతా కూడా చాలా భిన్నంగా.. కొత్తగా అనిపించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/