Begin typing your search above and press return to search.

ఇప్పుడు కథ కోసం హీరోను వెతుకుతా -వైట్ల

By:  Tupaki Desk   |   14 Oct 2015 4:00 AM IST
ఇప్పుడు కథ కోసం హీరోను వెతుకుతా -వైట్ల
X
ఒక్క ఫ్లాప్‌ జీవితాన్నే మార్చేస్తుంది అంటూ సాధారణంగా ఫ్లాపు సినిమా తీసి అందులోంచి బయటకు రావడానికి చాలా ఇబ్బందులు పడిన దర్శకులు చెబుతుంటారు. అయితే దర్శకుడు శ్రీను వైట్ల మాత్రం.. ఆల్రెడీ ఒక పెద్ద స్టార్‌ డైరక్టర్‌. అయినాసరే ''ఆగడు'' ఫ్లాప్‌ తనకు అతి పెద్ద పంచ్‌ ఇచ్చిందీ అంటున్నాడు. అందుకే ఇప్పుడు పూర్తిగా పంథాను మార్చేశాడట.

విషయం ఏంటంటే.. ఆగడు ఫ్లాప్‌ తరువాత శ్రీను వైట్ల ఒకింత సందిగ్ధంలో పడిపోయాడు. అప్పటికే ఓకె అనుకున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సినిమా పడుతుందా పడదా అని ఫీలయ్యాడు. ''ఒక ఫ్లాప్‌ తీశాక కూడా.. నా నుండి ఫ్రీడం లాగేసుకోకుండా నన్ను నమ్మి ఇంత ప్రాజెక్టు ఇచ్చినందుకు చిరంజీవి గారికీ, చరణ్‌ కు కృతజ్ఞతలు ఎలా చెప్పినీ తీరదు. ఈ సినిమాతో హిట్టిచ్చే.. వాళ్ళకి థ్యాంక్స్‌ చెప్పాలి'' అంటున్నాడు వైట్ల. అయితే ఈ ''బ్రూస్‌ లీ'' సంగతి పక్కనెట్టేస్తే.. అసలు వైట్ల తదుపరి సినిమా ఏంటి?

''మొన్నటివరకు నాకు డేట్లు ఇచ్చిన హీరోల కోసం కథలు రాసుకున్నా. ఇప్పుడు రూటు మర్చేశా. నా దగ్గర రెండు కథలు ఉన్నాయి. వాటిని ఫుల్‌ ప్లెడ్జడ్‌ స్క్రిప్టులుగా మారుస్తాను. ఆ తరువాత వాటికి ఏ హీరో సరిపోతాడో వాళ్ళను ఎప్రోచ్‌ అవుతా. నా కథ కోసం హీరోను వెతుక్కుంటా..'' అంటూ ఫిలసాఫికల్‌ గా కోట్‌ చేశాడు. మొత్తానికి ఆగడు ఇచ్చిన స్ర్టోక్‌ తో ఓసారి రియాల్టీ కనిపించుంటుంది. అయితే కమర్షియల్‌ విలువలు పాడవ్వకుండా.. కొత్తరకం సినిమాలు తీస్తానంటున్నాడు వైట్ల. చూద్దాం మరి ఏం చేస్తాడో...