Begin typing your search above and press return to search.
ఆయన 'రెడీ'.. ఎవరు 'ఢీ' కొడతారో??
By: Tupaki Desk | 14 Nov 2015 1:00 PM ISTఆయన చెయ్యేస్తే సినిమా హిట్టే అన్న టాక్ నడిచేది. ఆయన తీస్తే బ్లాక్ బస్టరే అన్న పేరుండేది. ఆయన ఏం చేసినా మినిమం గ్యారెంటీ గురూ అని ముచ్చట్లాడుకునేవారు. అయితే అవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు అతడిని ఊపిరి సలపనివ్వని పరిస్థితిని తెచ్చాయి. రియలైజ్ అవుదాం. తిరిగి ఏదైనా మ్యాజిక్ చేయాలి అనుకున్నా ఇప్పుడు అతడిని పలకరించే నాధుడే లేకపాయె! అసలింతకీ ఎవరి గురించి ఇదంతా? అవును మీరు ఊహించినట్టే స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల గురించే ఇదంతా. ఇదంతా వరుస వైఫల్యాలు తెచ్చిన ముప్పు. అవకాశం ఇచ్చినా ప్రూవ్ చేసుకోలేకపోవడం వల్ల వచ్చినన ప్రమాదం. ఆ సంగతిని అర్థం చేసుకునే లోగానే అంతా అయిపోయింది.
ఆగడు - బ్రూస్ లీ వైఫల్యాలు శ్రీనూని అంత తేలిగ్గా వదిలిపెట్టేట్టే లేవు. ఆగడు లాంటి డిజాస్టర్ ని ఇచ్చాక కూడా అతడిని నమ్మి చరణ్ - చిరు - దానయ్య అంతటివారు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. కానీ శ్రీనూ చేసిందేంటి? మరో పరాజయాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు. ఫలితం ఇప్పుడు అతడిని ఎవరూ నమ్మడం లేదని ఫిలింనగర్ లో గుసగుసలు. శ్రీనూ ఎలాగైనా బ్యాక్ టు లైమ్ లైట్ అంటూ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఢీ - రెడీ లాంటి సినిమాలు చేయాలని తపిస్తున్నాడు. స్ర్కిప్టు వర్క్ ని పూర్తి చేసుకుంటున్నాడని సమాచారం. అయితే అతడిని నమ్మి సినిమా చేసేందుకు నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదన్నది తాజా అప్ డేట్.
అయితే ఢీ లాంటి హిట్టిచ్చినందుకు మంచు క్యాంప్ ఓసారి అతడివైపు చూస్తుందా? రెడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు రామ్ ఏమైనా అవకాశం ఇస్తాడా? వేచి చూడాలి. మేలు చేసినవాడి కీడెంచని తత్వం ఆ ఇద్దరికీ ఉందని అంటారు. చూద్దాం ఏం జరుగుతుందో?