Begin typing your search above and press return to search.

ఆ కమెడియన్‌ మేనల్లుడు హీరోగా..

By:  Tupaki Desk   |   7 April 2015 11:30 PM GMT
ఆ కమెడియన్‌ మేనల్లుడు హీరోగా..
X
నిమిషం కనిపించే పాత్రలతో మొదలుపెట్టి.. 'గీతాంజలి' సినిమాతో హీరో అవతారం కూడా ఎత్తాడు కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి. టాలీవుడ్‌లో మంచి టైమింగ్‌ ఉన్న కమెడియన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడతను. దశాబ్దంన్నర నుంచి ఇండస్ట్రీలో ఉన్న శ్రీనివాసరెడ్డి ఇప్పుడున్న స్థాయికి రావడానికి ఎంత కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అతడి కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడిప్పుడే వస్తోంది. తన మిత్రుడైన రాజ్‌కిరణ్‌ను 'గీతాంజలి' సినిమాతో దర్శకుణ్ని చేసిన శ్రీనివాసరెడ్డి.. ఇప్పుడు తన మేనల్లుడిని హీరోగా పరిచయం చేయబోతున్నాడు.

శ్రీనివాసరెడ్డి మేనల్లుడు సుజిత్‌ రెడ్డి కథానాయకుడిగా నీతా ఫిలిమ్స్‌ పతాకంపై ఓ సినిమా మొదలైంది. చంద్రశేఖర్‌ ఏలేటి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చంద్రశేఖర్‌ కానూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కల్కి మిత్ర అనే కొత్త కథానాయిక సుజీత్‌ సరసన నటిస్తోంది. శ్రీనివాసరెడ్డి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. మంచి కథ కుదిరిందని.. ఏకధాటిగా షూటింగ్‌ చేసి.. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తామని నిర్మాత క్రాంతి నిరంజన్‌ రెడ్డి తెలిపాడు.