Begin typing your search above and press return to search.
బన్నీతో సినిమా చేయాలని ఉంది
By: Tupaki Desk | 30 Jan 2016 5:30 PMసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు అంటూ.. హ్యాట్రిక్ హీరో రాజ్ తరుణ్ తో మూవీ తీశాడు కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి. ఈనెల 29న రిలీజ్ అయిన ఈ మూవీ.. ఇప్పుడు మిక్సెడ్ టాక్ తో నడుస్తోంది. టాక్ పరంగా యావరేజ్ ఉన్నా.. కలెక్షన్లు మాత్రం పర్లేదనిపించే స్థాయిలో ఉండడం విశేషం. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి కొన్ని సంగతులు పంచుకున్నాడు.
నర్సీపట్నంలోని బయ్యవరంలో పుట్టిన ఈయన.. పూరీ జగన్నాథ్ స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాడట. సినిమాలపై ఉన్న ఆసక్తితో, ఎవరికీ చెప్పాపెట్టకుండా హైద్రాబాద్ వచ్చేశానంటున్నాడు. 2007లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన నగరం మూవీకి అసిస్టెంట్ గా వర్క్ చేశాడు. అప్పట్లోనే గరం స్టోరీ అల్లు అర్జున్ కి వినిపించాడట కానీ.. వర్కవుట్ కాలేదని చెబుతున్నాడు శ్రీనివాస్. ఇప్పుడు ఆ మూవీనే ఆది హీరోగా చేశాడట. అలాగే సినిమా చూపిస్త మావ టైంలో రాజ్ తరుణ్ కి కథ చెప్పగా.. అది నచ్చడంతో ఇప్పుడు సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు అనే టైటిల్ తో తెరకెక్కించానన్నాడు ఈ డైరెక్టర్.
తనకు తెలిసిన వాళ్ల ప్రేమకథల ఆధారంగానే ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడట. మల్టీప్లెక్సుల్లో టాక్ యావరేజ్ గా ఉన్నా.. బీ, సీ సెంటర్లలో మాత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని చెబ్తున్నాడు. అంతే కాదు.. ప్రయోగాల జోలికి వెళ్లకుండా కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నానని చెప్పాడీయన. అల్లు అర్జున్ తో మూవీ చేయాలని ఉందని, ప్రస్తుతం ఓ క్రేజీ హీరోకి కథ చెప్పానని త్వరలోనే డీటైల్స్ వెల్లడిస్తానంటున్నాడు శ్రీనివాస్ గవిరెడ్డి.