Begin typing your search above and press return to search.

క్లిక్ క్లిక్‌ : పాపం కేజీఎఫ్ బ్యూటీ ముందు ఖాళీ కంచం

By:  Tupaki Desk   |   1 Jan 2023 3:30 PM GMT
క్లిక్ క్లిక్‌ : పాపం కేజీఎఫ్ బ్యూటీ ముందు ఖాళీ కంచం
X
కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కేజీఎఫ్‌ సినిమా తర్వాత ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకుంది. అయితే ఈ అమ్మడు వరుసగా సినిమాలకు కమిట్‌ అవ్వకుండా భారీ సినిమాల కోసం వెయిట్‌ చేస్తోంది. కేజీఎఫ్‌ తో వచ్చిన స్టార్‌ డమ్‌ తో పాన్‌ ఇండియా సినిమాలు చేయాలని ఈమె ఆశ పడుతున్నట్లుగా తెలుస్తోంది.

వచ్చిన అవకాశాలన్నింటిని కూడా వదిలిపెట్టకుండా చేయాలని భావించడం లేదని.. మంచి పాత్ర, మంచి కథ ఉన్న సినిమాలకు మాత్రమే ఓకే చెప్పాలని భావిస్తున్నట్లుగా ఈ అమ్మడు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. కేజీఎఫ్ తర్వాత ఈ అమ్మడు చేసిన కోబ్రా సినిమా డిజాస్టర్ అవ్వడం కాస్త మైనస్ అయ్యింది.

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తినేందుకు కంచం ముందు కూర్చున్న శ్రీనిధి శెట్టి ఇంకా ఎంత సేపటికి వడ్డిస్తారు.. ఆకలిగా ఉంది అన్నట్లుగా ఫేస్ ను పెట్టి కెమెరా కి ఫోజ్ ఇచ్చింది. ఫొటో చాలా క్యూట్‌ గా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అందంతో పాటు నటన విషయంలో మంచి ప్రతిభ ఉన్న శ్రీనిధి శెట్టి పెద్ద ఆఫర్స్‌ కోసం వెయిట్‌ చేయకుండా వచ్చిన సినిమాలను సద్వినియోగం చేసుకోవాలి అంటూ అభిమానులు ఆమెను కోరుతున్నారు. ఈ ఏడాది అయినా ఆమె నుండి రెండు మూడు సినిమాలు వస్తాయేమో చూడాలి.