Begin typing your search above and press return to search.
బిబి4ః అఖిల్ ఇజ్జత్ తీసి అభిని లేపి వెళ్లారు
By: Tupaki Desk | 16 Dec 2020 1:32 PM ISTతెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఈ వారంతో ముగియబోతుంది. మరో నాలుగు రోజుల్లో ఫైనల్ ఎపిసోడ్ ఉండబోతుంది. ఫైనల్ 5 నుండి ఎవరు విజేతగా నిలుస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తిగా ఉంది. ఎక్కువ శాతం మంది అభిజిత్ అంటూ ఉన్నారు. అయితే చివరి నిమిషంలో ఏమైనా అద్బుతం జరిగి మరెవ్వరైనా విజేతగా నిలుస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది. ఇక చివరి వారంలో ఎప్పటిలాగే పెద్దగా టాస్క్ లు ఏమీ లేకుండా కంటెస్టెంట్స్ చాలా రిలాక్స్ గా ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ లో గత మూడు సీజన్ ల టాప్ కంటెస్టెంట్స్ అయిన హరితేజ.. గీతామాధురి.. శ్రీముకి ఇంకా అలీరెజాలు వచ్చారు.
ఈ నలుగురు ఇంట్లో ఉన్న అయిదు మందితో సరదాగా ముచ్చట్లు పెట్టారు. బయట ఎలా ఉంది అనేది వారికి డైరెక్ట్ గా చెప్పకుండానే జనాలు ఏమనుకుంటున్నారు అనే విషయం వారికి రిజిస్ట్రర్ అయ్యే విధంగా చెప్పేశారు. అఖిల్ నీ పులిహోర ఎక్కువ అవుతుంది అంటూ అంతా కూడా అనడం జరిగింది. చిన్న పిల్లాడిగా అలగడం ఏంటీ.. నీ పులిహోరకు హారిక పడిపోయినట్లుగానే ఉంది అంటూ గీతా మాధురి మరియు శ్రీముఖి చెప్పింది. ఇక ఇదే సమయంలో అభిజిత్ పై వచ్చిన వారు అంతా కూడా ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించారు.
ఇంటి సభ్యుల్లో అభిజిత్ కు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ మరెవ్వరికి లేదు. అభిజిత్ పై చిన్న విమర్శ చేసినా కూడా ఆమద్య నెటిజన్స్ రాహుల్ ను ఏ స్థాయిలో టార్గెట్ చేశారో మమ్ములను కూడా టార్గెట్ చేస్తారేమో అనుకున్నారు. అందుకే వద్దులే అనుకుని అభిజిత్ గురించి అంతా పాజిటివ్ గానే మాట్లాడారు. అభిజిత్ ఆట తీరును ప్రశంసించిన ఆ నలుగురు అఖిల్ ఇజ్జత్ తీసి పారేశారు. మిగిలిన వారి గురించి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా మాట్లాడేశారు.