Begin typing your search above and press return to search.

కిక్‌ 2 సినిమాకు దెబ్బేస్తున్న మహేష్‌!!

By:  Tupaki Desk   |   18 Aug 2015 12:20 PM GMT
కిక్‌ 2 సినిమాకు దెబ్బేస్తున్న మహేష్‌!!
X
ఇకపోతే బాహుబలి సినిమా రిలీజ్‌ అవ్వడానికి బాగా గ్యాప్‌ ఇచ్చిన మహేష్‌.. తన బీభత్సమైన ప్రమోషనల్‌ స్ర్టాటజీలతో తన వెనుకే రాబోతున్న సినిమాలను మాత్రం బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఫిలిం నగర్‌ లోఈ టాపిక్‌ పైనే చర్చలు జరుగుతున్నాయ్‌. ఎందుకంటే మహేష్‌ పెట్టబోతున్న థ్యాంక్యూ మీట్‌ కారణంగా అక్కడ మాస్‌ రాజా సినిమాకు ఎసరు తగిలే ఉంది.

ఆగస్టు 20న మహేష్‌ తన థ్యాంక్యూ మీట్‌ పెడుతున్నాడు. అంటే 21న రిలీజయ్యే కిక్‌ 2 సినిమాకు ఈ రూపంలో భారీ గండి పడినట్లే. ఒక ప్రక్కన మహేష్‌ బాబు పెట్టే థ్యాంకూ మీట్‌ అంటే మీడియా ఫోకస్‌ అంతా దాని మీదనే ఉంటుంది. తెల్లారి పేపర్ల లో, టివిల్లో, వెబ్‌ సైట్ల లో.. ఇలా అన్ని చోట్లా మహేష్‌ గురించి వార్తలుంటాయి. ఇంక కిక్‌ 2 గురించి పట్టించుకునేదెవరు? ఈ రేంజులో మీటింగ్‌ పెడుతున్నప్పుడు మహేష్‌ ఏ ఆదివారమో ప్లాన్‌ చేసుకుంటే హ్యాపీగా అందరికీ కలిసొచ్చేది. కాని గురువారం ఈవెనింగ్‌ మీటింగ్‌ పెడుతన్నాడంటే.. పాపం కిక్‌ 2 కి దగ్గరుండి మరీ దెబ్బేస్తున్నట్లే. మహేష్‌ కు ఒకవేళ కిక్‌ 2 రిలీజ్‌ డేట్‌ తెలియకపోవచ్చు.. కాని పక్కనే ఉన్న నిర్మాతలు, ఇతర భజన బ్యాచ్‌ అంతా ఏం చేస్తున్నట్లో??

ఇకపోతే వరుసగా ఈ థ్యాంక్యూ మీట్లు హైదరాబాద్‌ తో పాటు విజయవాడు, వైజాగ్ లో కూడా పెడతారట. అప్పట్లో సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాను బన్నీ ఎలా థ్యాంక్యూ మీట్ల పేరుతో ప్రమోట్‌ చేసుకున్నాడో.. ఇప్పడు మహేష్‌ కూడా సేమ్‌ స్ర్టాటజీ వాడేస్తున్నాడనమాట. బాగానే ఉంది.. కాని చూస్తుంటే సెప్టంబర్‌ 4న వచ్చే రుద్రమదేవికి కూడా శ్రీమంతుడు ప్రమోషన్‌ సెగ తగిలేలా ఉందే!?!