Begin typing your search above and press return to search.

సాంగ్‌ టాక్‌: రంజుగా రామ రామ

By:  Tupaki Desk   |   18 July 2015 5:13 PM GMT
సాంగ్‌ టాక్‌: రంజుగా రామ రామ
X
మహేష్‌ శ్రీమంతుడు ఆడియో ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసింది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఆల్బమ్‌ కి క్లాస్‌ హిట్‌ అన్న టాక్‌ వచ్చింది. ఈ సినిమాలో పాటలన్నీ చాలా క్లాసీగా అదిరిపోయాయంటూ ప్రశంసలొస్తున్నాయి. ముఖ్యంగా ఆడియోలోని తొలి పాట రామ రామ వెరీ స్పెషల్‌. సూరజ్‌ సంతోష్‌, రాణి నా రెడ్డి ఈ పాటని ఆలపించారు.

గాయనీగాయకులు పాడిన శైలి, మహేష్‌ స్టెప్పులు ఎంతో ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. దేవీ మార్క్‌ ఎనర్జీ బాణీలో పెద్ద అస్సెట్‌ అయ్యింది. సీనియర్‌ లిరిసిస్ట్‌ రామజోగయ్య శాస్త్రి మరోసారి పెన్‌ పవర్‌ ఎలా ఉంటుందో చూపించారు. శ్రీమంతుడు ఆల్బమ్‌ లో ఇదో ఎనర్జిటిక్‌ సాంగ్‌. అలాగే విజువల్‌ గా ఈ పాట చాలా రిచ్‌ గా ఉంది. ఓ ఇంటి మండువాలో రంగు రంగుల కాంతుల మధ్య, కలరింగు మధ్య ధేధీప్యమానంగా చిత్రీకరించారు.

అంతమంది డ్యాన్సర్లు, నృత్యకారుల మధ్యలో మహేష్‌ వెరీ స్పెషల్‌ లుక్‌ లో కనిపిస్తున్నాడు. అంతేనా ఓ ఎర్ర రంగు రిబ్బను నుదుటిపై కట్టుకుని విజువల్‌కి సరికొత్త యాంబియెన్స్‌ తెచ్చాడు. శ్రీమంతుడిలోని కొత్త కోణం ఈ పాటలో ఆవిష్కరించినట్టు అనిపించింది.

Video Link : https://youtu.be/a6h-eZeP6v4