Begin typing your search above and press return to search.

మహేష్‌ వస్తున్నాడంటే కష్టమే!!

By:  Tupaki Desk   |   8 Jun 2015 9:24 PM IST
మహేష్‌ వస్తున్నాడంటే కష్టమే!!
X
ఇంతకీ జూలై 17న మహేష్‌ బాబు వస్తున్నాడా రావట్లేదా? ఇప్పుడు టాలీవుడ్‌ అభిమానులనే కాదు, చాలామంది పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్‌ను సైతం అదరగొట్టేస్తున్న క్వశ్చన్‌ ఇది. ఒక ప్రక్కన బాహుబలి వస్తుందని అందరూ భయపడుతుంటే.. మరో ప్రక్కన మహేష్‌ బాబు మాత్రం బాహుబలి బాబులను భయపెట్టేస్తోంది.

నిజానికి జూలై 10న బాహుబలి వస్తుందని కాస్త ముందుగా వచ్చి క్యాష్‌ చేసుకుందాంలే అంటూ రుద్రమదేవి, కిక్‌2 వంటి సినిమాలు తర్జనభర్జన పడుతున్నాయి. వీళ్ళందరికీ బాహుబలి దగ్గరకు వచ్చేకొద్దీ భయమే. అయితే 10న బాహుబలి రాగానే 17న శ్రీమంతుడు వస్తున్నాడు. ఇండియావైడ్‌ బాహుబలి రన్నింగ్‌ ఎలా ఉన్నా కూడా.. టాలీవుడ్‌లో మాత్రం శ్రీమంతుడు వచ్చాడంటే రచ్చ రచ్చే.

జనాలకు రెండు సినిమాల్లో ఏది పెద్ద బడ్జెట్‌ అనే క్యాలుకలేషన్‌ కంటే ఎవరు పెద్ద హీరో అనే ఫీలింగే ఎక్కువగా ఉంటుంది. పైగా ఆ రెండు గంటల్లో లోపల ఏం చూపిస్తున్నారో అనే పాయింట్‌ మీదనే అసలు ఫోకస్‌ అంతా.. కాబట్టి మహేష్‌ వస్తున్నాడంటే మరి బాహుబలిని డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నవారికి కాస్త భయం ఉంటుందిలే.

పైగా ఓవర్‌సీస్‌ అనేది మహేష్‌ దత్తత తీసుకున్న ప్లేసాయే. కాబట్టి 17న రాకుండా మహేష్‌ పోస్ట్‌పోన్‌ చేస్తాడేమో అని వీరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారట.