Begin typing your search above and press return to search.

'శ్రీమంతుడి' రికార్డులు కొనసాగుతున్నాయి!

By:  Tupaki Desk   |   18 Oct 2016 9:30 AM GMT
శ్రీమంతుడి రికార్డులు కొనసాగుతున్నాయి!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - సంచలన దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా తానే చెప్పుకునే ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డ్ లన్నింటిని తిరగరాసింది. "గ్రామాల దత్తత" అనే కాన్సెప్టు పై తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సాధించిన విజయం అనంతరం ఇది మహేష్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అతి పెద్ద విజయాల్లో ఒకటి అని ప్రశంసలు లభించాయి. అయితే విడుదలయ్యి ఇన్ని రోజులైనా ఈసినిమా ఇప్పటికీ తన రికార్డ్ ల హవా కొనసాగిస్తూనే ఉంది.

ఈ సినిమాలో కొరటాల మార్కు దర్శకత్వం - చిన్నగా చురుకుగా ఉండే మాటలు - మహేష్ నటన - శ్రుతిహాసన్ గ్లామర్ - జగపతి - రాజేంద్ర ప్రసాద్ ల నటనలతో పాటు ఈ సినిమా విజయంలో కీలక భూమిక పొషించింది ఆ సినిమాలోని పాటలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటలు అప్పట్లో సంచలనం రేపాయి. "రామ రామా" అంటూ అంటూ వచ్చిన ఎంట్రీ సాంగ్ దగ్గరనుంచి - "దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే" అంటూ సాగే చివరి పాట వరకూ దేవీ ఆల్ సాంగ్స్ హిట్ ఇచ్చాడు. ఇక క్యూట్ లవ్ సాంగ్ "జత కలిసే" అయితే స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ఈ స్థాయిలో ఉన్న ఈ ఆడియోకి తాజాగా ఒక రికార్డు కూడా వచ్చింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన శ్రీమంతుడు ఆడియో సాంగ్స్ ను అదే కంపెనీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లోనూ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. జూలై 18 - 2015 న అంటే దాదాపు ఏడాదిన్నర క్రితం రిలీజ్ అయిన ఈ పాటలను ఇప్పటి వరకు 80 లక్షల మందిపైగా యూట్యూబ్ లో వినటంతో అరుదైన రికార్డ్ శ్రీమంతుడు సొంతమయ్యింది. ఈ విజయం పై ఆదిత్య మ్యూజిక్ కంపెనీతో పాటు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/