Begin typing your search above and press return to search.

శ్రీమంతుడు.. 175 నాటౌట్‌!!

By:  Tupaki Desk   |   28 Jan 2016 12:59 AM IST
శ్రీమంతుడు.. 175 నాటౌట్‌!!
X
ఒక మంచి సినిమాను ప్రేక్షకులు ఎలాగైనా ఆదరిస్తారు. అదే సినిమాలో కాస్త కమర్షియల్‌ అంశాలు.. ఒక స్టార్‌ హీరో ఉంటే.. అదే ''శ్రీమంతుడు''. డబ్బున్నవారు దేశంలోని కొన్ని నిరుపేద పళ్లెటూళ్లను దత్తత తీసుకోవడం అంటూ ముందుకొచ్చిన కాన్సెప్ట్‌ ఈ సినిమా. కొరటాల శివ డైరక్షన్‌లో.. సూపర్‌ స్టార్‌ మహేష్‌ కో-ప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తూ.. ఈ శ్రీమంతుడును దించారు.

ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన శ్రీమంతుడు నేటితో (జనవరి 28) 175 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఎమ్మిగనూరులోని లక్ష్మణ్‌ ధియేటర్లో ఈ సినిమా నిరంతరంగా నిరాటంకంగా 175 కొట్టేసి.. రికార్డును సృష్టిస్తోంది. మొన్న జరిగిన ఐఫా ఉత్సవం అవార్డులో ఏకంగా ఆరు అవార్డులు గెలుచుకున్న చిత్రం శ్రీమంతుడు.. ఇదే సమయంలో ఇలా 175 మార్కును టచ్‌ చేసుకొని సిల్వర్‌ జూబ్లీ డే సెలబ్రేట్‌ చేసుకోవడంతో శ్రీమంతుడు టీమ్‌ మొత్తం మాంచి ఉత్సాహంగా ఉంది.

ఇక శ్రీమంతుడు గురించి చెప్పాలంటే.. కొరటాల కథ - పదునైన సంభాషణలు - ఆకట్టుకునే స్ర్కీన్‌ ప్లే ఒక ఎత్తయితే.. మహేష్‌ బాబు నటనా కౌశల్యం.. శృతిహాసన్‌ పరిణితి చెందిన నటన కనబరుస్తూనే గ్లామర్‌ ఆరబోయడం.. తండ్రిగా జగపతి బాబు లుక్‌.. దేవిశ్రీప్రసాద్‌ అందించి మాంచి పాటలు.. అలాగే బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌.. వెరసి సినిమాకు అన్ని విధాలుగా సినిమాను ఏకంగా 86 కోట్ల షేర్‌ ను వసూలు చేసి.. బాహుబలి తరువాత రెండో అతి పెద్ద గ్రాసర్‌ గా తెలుగు సినిమా చరిత్రను తిరగరాశాడు శ్రీమంతుడు.