Begin typing your search above and press return to search.

మహేష్ తో శ్రీలీల.. ఇంతకంటే ఏం కావాలి..!

By:  Tupaki Desk   |   17 Jan 2023 2:30 AM GMT
మహేష్ తో శ్రీలీల.. ఇంతకంటే ఏం కావాలి..!
X
సూపర్ స్టార్ మహేష్ 28వ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్లాన్ చేశారు. త్రివిక్రం డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఆల్రెడీ పూజా హెగ్డే ఫిక్స్ అవగా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీ లీల ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ శ్రీ లీల విషయంపై క్లారిటీ ఇచ్చారు. మహేష్ సినిమాలో శ్రీ లీల కూడా నటిస్తుందని కన్ఫర్మ్ చేశారు. అయితే సెకండ్ హీరోయిన్ అనే నెంబరింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదని.. నిర్మాతలు ఎవరు అలా అనరని చెప్పారు నాగ వంశీ.

మహేష్ సినిమాలో శ్రీ లీల కూడా ఒక హీరోయిన్ అని ఆయన అన్నారు. మొత్తానికి కన్నడ కుట్టి మూడవ సినిమాకే మహేష్ తో నటించే ఛాన్స్ అందుకుంది. రీసెంట్ గా వచ్చిన ధమాకాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీ లీల కెరీర్ లో మంచి దూకుడు చూపిస్తుంది. పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీ లీల ఆ సినిమాతోనే ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఇక ధమాకాలో ఆమె ఎనర్జీ మరోసారి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.

ఇక ఇప్పుడు మహేష్ సినిమాలో ఛాన్స్ అంటే అమ్మడికి ఇక తిరుగుండదని చెప్పొచ్చు. శ్రీ లీలలో ఆ టాలెంట్ ఉంది కాబట్టే ఆమెకు ఇలాంటి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ధమాకా టైం లో రవితేజ ఆమె గురించి చెప్పినప్పుడే అర్ధమైంది. శ్రీ లీల తప్పకుండా చాలా పెద్ద స్థాయికి వెళ్తుందని అన్నారు. ఆయన చెప్పినట్టుగానే మహేష్ సినిమాతో ఆమె కెరీర్ పీక్స్ కు వెళ్తుంది. మహేష్ తో నటించాలని ఎంతోమంది హీరోయిన్స్ కలలు కంటారు. కానీ రెండు సినిమాలే చేసి శ్రీ లీల ఆ లక్కీ ఛాన్స్ అందుకుంది.

అందులోనూ త్రివిక్రం డైరెక్షన్ లో సినిమాలో ఛాన్స్ అంటే అది మాములు విషయం కాదు. అయితే త్రివిక్రం సినిమాలో సెకండ్ హీరోయిన్స్ గా చేసిన వారికి కెరీర్ అంతగా కలిసి రాలేదు. సినిమాలో వారి పాత్రలకు కూడా పెద్ద ప్రాధాన్యత ఉండదు. మరి శ్రీ లీల విషయంలో కూడా అలానే జరుగుతుందా లేక ఆమెకి మంచి పాత్ర ఇచ్చారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా శ్రీ లీల వరుస ప్రాజెక్ట్ లు చూస్తుంటే నెక్స్ట్ టాప్ హీరోయిన్ ఆమెనే అని ఫిక్స్ అయ్యేలా ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.