Begin typing your search above and press return to search.

'రైతు దినోత్సవం' సందర్భంగా రైతులకు సెల్యూట్ చేసిన 'శ్రీకారం' టీమ్..!

By:  Tupaki Desk   |   23 Dec 2020 10:49 AM IST
రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు సెల్యూట్ చేసిన శ్రీకారం టీమ్..!
X
వర్సటైల్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ''శ్రీకారం''. కిశోర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌ పై రామ్ ఆచంట‌ - గోపి ఆచంట నిర్మిస్తున్నారు. శర్వా కి జోడీగా 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్‌ నటిస్తోంది. ఇందులో శర్వానంద్‌ యువ రైతు పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన 'శ్రీకారం' ప్రచార చిత్రాలు మరియు రాయలసీమ జానపద కళాకారుడు పెంచల్ దాస్ పాడిన 'భలేగుంది బాలా' సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో నేడు 'నేషనల్ ఫార్మర్స్ డే' సందర్భంగా మరో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ రైతులందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపింది.

'జాతీయ రైతుల దినోత్సవం' సందర్భంగా 'రైతు పది వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే మన ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్తాయి' అని 'శ్రీకారం' టీమ్ పేర్కొంది. తాజాగా విడుదల చేసిన 'శ్రీకారం' పోస్టర్ లో శర్వానంద్ వ్యవసాయ ట్రాక్టర్ తో పొలం దున్నుతున్నట్లు కనిపిస్తోంది. కాగా, మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీత స్వరాలు అందిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. జె యువరాజ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నరేష్ - సాయికుమార్‌ - మురళి శర్మ - రావు రమేష్‌ - ఆమని - సత్య - సప్తగిరి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న 'శ్రీకారం' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.