Begin typing your search above and press return to search.

జ‌గ‌ప‌తిబాబులా స‌క్సెస‌వుతాడా?

By:  Tupaki Desk   |   8 May 2020 11:45 AM IST
జ‌గ‌ప‌తిబాబులా స‌క్సెస‌వుతాడా?
X
హీరోగా సక్సెస్ ముఖం చాటేస్తున్న క్ర‌మంలోనే ఎలాంటి ఈగోల‌కు తావివ్వ‌కుండా విల‌న్ పాత్ర‌ల వైపు మొగ్గు చూపారు జ‌గ‌ప‌తిబాబు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా .. విల‌న్ గా రాణించేందుకు మొహ‌మాట‌ప‌డ‌లేదు. ఆ క్ర‌మంలోనే బోయ‌పాటి శ్రీ‌ను లాంటి మాస్ డైరెక్ట‌ర్ ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నాడు. న‌ట‌సింహా నందమూరి బాల‌కృష్ణ‌.. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. ఎన్టీఆర్.. చ‌ర‌ణ్‌.. మ‌హేష్ లాంటి స్టార్లు జ‌గ‌ప‌తిబాబును ఎంక‌రేజ్ చేశారు. ఆ కోవ‌లోనే అంత‌గా సక్సెస్ లేని రాజ‌శేఖ‌ర్.. శ్రీ‌కాంత్ లాంటి స్టార్ల‌ను ఆద‌రించేందుకు ప్రోత్స‌హించేందుకు ప‌రిశ్ర‌మ ఎప్పుడూ ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తూనే ఉంది.

తాజాగా శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్ వంతు వ‌చ్చింది. శ్రీ‌కాంత్ కెరీర్ మొద‌లైందే విల‌న్ గా.. కాబ‌ట్టి అత‌డు ఇప్పుడే కొత్త‌గా విల‌నీ చేయాల్సిన ప‌నే లేదు. కెరీర్ మిడిల్ లో ప‌లుమార్లు క్యారెక్ట‌ర్ల‌లో రాణించాడు మెప్పించాడు. ఇటీవ‌ల కొన్ని సినిమాల్లో విల‌న్ గానూ న‌టించాడు. అయితే చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ విల‌న్ గా న‌టించే అవ‌కాశం బాల‌య్య‌- బోయ‌పాటి రూపంలో త‌న‌ని వెతుక్కుంటూ వ‌చ్చింది. ఎన్బీకే 106లో శ్రీ‌కాంత్ కి విల‌నీ చేసే అవ‌కాశాన్ని బోయ‌పాటి క‌ల్పించార‌ట‌. ఆ పాత్ర కోసం శ్రీ‌కాంత్ పూర్తిగా రూపం మార్చుకున్నారు.

ఇది స్టైలిష్ విల‌నీ కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టు సూటు బూటు వేసుకుని త‌ల‌క‌ట్టు మార్చి గుబురు గ‌డ్డం పెంచి పండు వెంట్రుక‌ల‌తో కాస్త కొత్త‌గానే క‌నిపిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతోంది. శ్రీ‌కాంత్ ఇంకా షెడ్యూల్ లో పాల్గొన‌లేదు. లాక్ డౌన్ ఎత్తేస్తే అటుపై జ‌రిగే షెడ్యూల్ లో జాయిన్ అవుతాడ‌ట‌. ఇంత‌కుముందు బాల‌య్య‌తో భారీ యాక్ష‌న్ స‌న్నివేశంతో పాటు కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించిన బోయ‌పాటి త‌దుప‌రి షెడ్యూల్ కోసం ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. ప్ర‌స్తుతం 52 ఏజ్ కి చేరువైన శ్రీ‌కాంత్ త‌న గెట‌ప్ ని కాస్త ధృఢంగా మార్చుకునేందుకు జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ట‌.