Begin typing your search above and press return to search.

శ్రీ‌కాంత్ కొడుకు కొత్త ల‌వ‌ర్ బోయా?

By:  Tupaki Desk   |   5 Sep 2015 6:45 PM GMT
శ్రీ‌కాంత్ కొడుకు కొత్త ల‌వ‌ర్ బోయా?
X
హీరో శ్రీ‌కాంత్ కొడుకు రోష‌న్‌ హీరో అవుతున్నాడు. నూనూగు మీసాల వ‌య‌సులో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రోష‌న్ ఇప్ప‌టికే రుద్ర‌మ‌దేవి 3డి చిత్రంలో బాల‌న‌టుడి గా న‌టించాడు. ఇప్పుడు ఏకంగా హీరో గానే తెరంగేట్రం చేసేస్తున్నాడు. అదీ నాగార్జున వంటి స్టార్ హీరో కం ప్రొడ్యూస‌ర్ అత‌డిని ఇంట్ర‌డ్యూస్ చేయ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌.

రోష‌న్ క‌థానాయ‌కుడి గా న‌టిస్తున్న ఈ చిత్రానికి నిర్మ‌ల కాన్వెంట్ అనే టైటిల్‌ని సెల‌క్ట్ చేశారు. అంతా కొత్త వారితో ఈ చిత్రాన్ని జి.నాగ కోటేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో మ్యాట్రిక్స్ టీమ్ వ‌ర్క్ , అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ‌లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. మ్యాట్రిక్స్ సంస్థ‌ తో క‌లిసి నాగార్జున పెట్టుబ‌డుల్ని స‌మ‌కూరుస్తున్నారు. జై చిరంజీవ - దూకుడు - రోబో చిత్రాల్లో న‌టించిన శ్రేయా శ‌ర్మ రోష‌న్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టిస్తోంది. కోటి త‌న‌యుడు రాజీవ్ సాలూరి సంగీతం అందిస్తున్నాడు. జైపూర్‌ - మెద‌క్‌ లో వ‌రుస షెడ్యూల్స్ పూర్త‌య్యాయి. అర‌కు లో మూడో షెడ్యూల్‌ ని తెర‌కెక్కించ‌నున్నారు. త్వ‌ర‌లో ఫ‌స్ట్‌ లుక్‌ ని ఆవిష్క‌రించ‌నున్నారు.

రోష‌న్ లుక్ ఇప్ప‌టికే బైటికొచ్చేసింది కాబ‌ట్టి ఈ లుక్ ప్ర‌కారం మ‌రో ల‌వ‌ర్‌బోయ్ టాలీవుడ్లో అడుగుపెడుతున్నాడ‌నే అర్థ‌మ‌వుతోంది. బ‌బ్లీ క్యూట్ అప్పియ‌రెన్స్‌ తో రోష‌న్ ఆక‌ట్టుకుంటున్నాడు. శ్రీ‌కాంత్ న‌ట‌వార‌సుడిగా పేరు నిల‌బెడ‌తాడేమో చూడాలి.