Begin typing your search above and press return to search.

ఆ చిన్న కుర్రాడు అందరినీ పడేశాడట

By:  Tupaki Desk   |   6 July 2017 4:02 PM GMT
ఆ చిన్న కుర్రాడు అందరినీ పడేశాడట
X
అబుదాబిలో సైమా అవార్డుల సందర్భంగా జరిగిన అనేక సంగతులు ఒక్కొక్కటిగా బైటకు వస్తున్నాయి. టాలీవుడ్ తరలివెళ్లిన ఈ కార్యక్రమం.. అనుక్షణం అందరినీ అలరించేసింది. అందరికంటే ఎక్కువగా ఇప్పుడో కుర్రాడి గురించి సినిమా జనాలు తెగ మాట్లాడేసుకుంటున్నారు. అతనెవరో కాదు.. సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్.

నిర్మలా కాన్వెంట్ అంటూ నాగార్జున చేతుల మీదుగా లాంఛ్ అయినా.. రోషన్ కు విజయం దక్కలేదు. అయితే.. ఇతడి ప్రవర్తన మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోతోంది. సైమా అవార్డుల సందర్భంగా.. తనకంటే వయసులో పెద్దవారైన ప్రతీ ఒక్కరి పాదాలకు రోషన్ నమస్కరించిన తీరు చూసి.. అందరూ ముగ్ధులైపోయారు. ఇవాల్టి రోజుల్లో ఇంతలా ఒదిగి ఉండే వ్యక్తి కనిపించడం బహు అరుదు అంటున్నారు. తన సింప్లిసిటీతోను.. మృదువైన మాటలతోను.. మంచి మనసుతోను భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి రోషన్ చేరడం ఖాయం అని అంటున్నారు.

అంతే కాదు.. రోషన్ లో సెన్సాఫ్ హ్యూమర్ కి తక్కువేమీ లేదు. సైమా ఫంక్షన్ ను హోస్ట్ చేసిన అల్లు శిరీష్.. రోషన్ ఇంగ్లీష్ లో మాట్లాడ్డంపై కౌంటర్ వేశాడు. అప్పుడు 'అన్నా.. నువ్వెక్కడ పుట్టావ్' అన్నాడు రోషన్. 'చెన్నై' అని శిరీష్ ఆన్సర్ ఇస్తే.. 'తెలుగు వ్యక్తి అయి ఉండి చెన్నైలో ఎలా పుట్టావ్' అని రోషన్ అడిగిన విధానానికి అక్కడి ఆహుతులంతా పగలబడి నవ్వేశారు.