Begin typing your search above and press return to search.

రంగంలోకి రెండో కొడుకు కూడా

By:  Tupaki Desk   |   19 Feb 2018 4:26 AM GMT
రంగంలోకి రెండో కొడుకు కూడా
X
టాలీవుడ్ నుంచి మరో వారసుడు ఇండస్ర్టీలోకి రంగ ప్రవేశం చేయబోతున్నాడు. సీనియర్ హీరో శ్రీకాంత్- ఊహల చిన్న తనయుడైన రోహన్ సినిమాల్లోకి అడుగు పెడుతున్నాడు. తల్లిదండ్రుల వారసత్వాన్ని నిలబెడుతూ సినిమాల్లోకి రావాలని ఆశపడ్డ రోహన్ కు తగిన స్ర్కిప్టు లభిండచంతో అందుకు ఓకే చెప్పి యాక్టింగ్ స్టార్ట్ చేసేశాడు.

రోహన్ నటించబోతున్న సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం.. హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. ఇందులో ప్రభుదేవా కీలక పాత్ర చేస్తున్నాడు. అతడికి ఈ మూడు భాషల్లోనూ మంచి ఇమేజ్ ఉండటంతో ఈ సినిమా కూడా మూడు భాషల్లోనూ విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. పాషన్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమాకు కొత్త దర్శకుడు ఆకాష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఓ హిల్ ఏరియా బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ ఉంటుందని కోలీవుడ్ టాక్. ఇప్పటికే ఊటీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసేశారని తెలుస్తోంది.

హీరో శ్రీకాంత్-ఊహలకు మొత్తం ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు రోషన్ ఇప్పటికే సినిమాల్లో నటించాడు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో నటించాడు. దీంతోపాటు నిర్మలా కాన్వెంట్ లోనూ హీరోగా నటించాడు. కుమార్తె మేధ కూడా రుద్రమదేవితోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు చిన్నకొడుకు కూడా సినిమాల్లోకి అడుగుపెట్టడంతో మొత్తం సినిమా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకోనుంది.