Begin typing your search above and press return to search.

అబ్బే.. ఈ పోలీసు అలాంటోడు కాదు

By:  Tupaki Desk   |   9 April 2016 4:18 AM GMT
అబ్బే.. ఈ పోలీసు అలాంటోడు కాదు
X
మొన్ననే చెప్పుకున్నాం. ''మెంటల్‌ పోలీస్‌'' సినిమా గురించి పోలీసు సంఘాలు కొన్ని హీరో శ్రీకాంత్‌ కు నోటీసులు ఇచ్చాయి. అయితే ఈ సినిమాలో నిజంగానే ఖాకీలను ఇన్సల్ట్‌ చేసే విషయాలు ఉన్నాయా? అసలు హీరో శ్రీకాంత్‌ ఈ విషయంపై ఏమంటున్నాడు.

''పోలీసులన్నా - పోలీసు విభాగం అన్నా ఎంతో గౌరవం. వారిని కించపరిచే పని ఏ సందర్భంలోనూ చేయను. ఈ చిత్రం చూసిన తర్వాత పోలీసులు మెచ్చుకుంటారు. ఏమైనా ఇబ్బందులుంటే పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నాం'' అంటూ సెలవిచ్చాడు శ్రీకాంత్‌. ఉగాది పర్వదినం సందర్బంగా శుక్రవారం సతీమణి ఊహ - కుమారుడు రోషన్ - కుమార్తె మేధతో కలసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను నటించిన మెంటల్ పోలీస్ చిత్రంపై పోలీసు సంఘాలు ఇచ్చిన నోటీసులపై ఇలా స్పందించారు.

ఇకపోతే తన కొడుకు రోషన్‌ హీరోగా కింగ్‌ నాగర్జున ''నిర్మల కాన్వెంట్‌'' అనే సినిమాను రూపొందించడం.. ఆ సినిమా జూన్‌/జూలై లలో విడుదలయ్యే ఛాన్సుండటం.. చాలా హ్యాపీగా ఉందంటూ శ్రీకాంత్‌ తెలియజేశాడు.