Begin typing your search above and press return to search.

దర్శకుడు లేకుండా సినిమానా?

By:  Tupaki Desk   |   22 Feb 2018 5:03 AM GMT
దర్శకుడు లేకుండా సినిమానా?
X
ఇప్పుడంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాక అవకాశాలు తగ్గాయి కాని ఒకప్పుడు శ్రీకాంత్ స్టార్ హీరోలతో ధీటుగా తనకంటూ ఒక మార్కెట్ సృష్టించుకున్నవాడే. కెరీర్ మొదట్లో విలన్ గా చిన్నా చితకా వేషాలు వేస్తూ బండి నెట్టుకొచ్చిన శ్రీకాంత్ కు పెళ్లి సందడి ఇచ్చిన బ్రేక్ నిర్విరామంగా ఓ ఇరవై ఏళ్ళ పాటు హీరో కెరీర్ ను ఎంజాయ్ చేసేలా మార్చింది. ఆ తర్వాత వరస పరాజయాలు, కుర్ర హీరోల తాకిడి ఎక్కువ కావడం తదితర కారణాల వల్ల స్పీడ్ బాగా తగ్గించేసాడు. మొదటిసారి శ్రీకాంత్ నటిస్తున్న హారర్ సినిమా రా..రా. ఈ సినిమా కోసం విస్తృతంగా ప్రమోషన్ చేస్తున్న శ్రీకాంత్ పోస్టర్లలో దర్శకుడి పేరు లేకపోవడం గురించి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.

సదరు దర్శకుడికి, నిర్మాతకు ఏవో విభేదాలు వచ్చిన కారణంగా అతను లేకుండానే సినిమా తీసామని, యూనిట్ లో ప్రతి ఒక్కరు ఎంతో బాధ్యతగా అందరు డైరెక్టర్ లాగా ఫీల్ అయ్యి పూర్తి చేయడానికి దోహదపడ్డారని చెప్పాడు. కాకపోతే ఒక మంచి వ్యక్తి టీంని మొత్తం నడిపించాడని, రారా విడుదల అయ్యాక అతను ఒప్పుకుంటే అప్పుడు పేరు వేస్తామని చెప్పాడు. కేవలం నిర్మాత నష్టపోకూడదు అనే ఒక ఒక్క కారణంతో సహకరించానని చెబుతున్న శ్రీకాంత్ అసలు గొడవ ఎందుకు వచ్చిందో మాత్రం చెప్పలేదు. ఒకవేళ సినిమా ఫలితం తేడా వస్తే ఆ పేరు బయటికి రాకుండా చేస్తారా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది.

నిజానికి ఇలాంటి గొడవలు కొత్త కాకపోయినా అసలు దర్శకుడి పేరే వేయకుండా సినిమాను ప్రమోట్ చేయటం మాత్రం ఈ మధ్య కాలంలో ఎన్నడు చూడలేదు. ఇటీవలే సందీప్ కిషన్ ప్రాజెక్ట్ జెడ్ అనే డబ్బింగ్ సినిమా విషయంలో కూడా నిర్మాత బషీర్ కు హీరో కు ఉన్న గ్యాప్ మీడియా సాక్షిగా బట్టబయలు అయ్యింది. ఎవరి వెర్షన్లో వారు కరెక్ట్ గానే అనిపించినా తెరవెనుక ఏం జరుగుతోంది అనేది మాత్రం ఇలాంటి కేసుల్లో అంతు చిక్కడం లేదు. మొత్తానికి సినిమాలో సస్పెన్స్ లాగే రారా దర్శకుడు ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలన్న మాట.