Begin typing your search above and press return to search.

మరో హీరోను విలన్ చేస్తున్న బాలయ్య

By:  Tupaki Desk   |   30 Jun 2017 10:51 AM IST
మరో హీరోను విలన్ చేస్తున్న బాలయ్య
X
నందమూరి బాలకృష్ణ సినిమాల్లో హీరోయిజం ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో.. విలన్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా కనిపిస్తారు. నిజానికి విలన్స్ ఎంత శక్తువంతులుగా ఉంటే హీరోయిజం అంతగా పండుతుందనే మాట వాస్తవమే. లెజెండ్ మూవీ ద్వారా టాలీవుడ్ ఫ్యామిలీ హీరో అయిన జగపతిబాబును క్రూరమైన విలన్ గా మార్చేశారు బాలయ్య. ఆ తర్వాత జగపతిబాబుకు అదే తరహా రోల్స్ తో సౌత్ అంతా చెలరేగిపోతున్నాడు.

ఇప్పుడు మరో టాలీవుడ్ ఫ్యామిలీ హీరోను కూడా విలన్ గా మార్చేస్తున్నారట బాలయ్య. ప్రస్తుతం మాటల దశల్లో ఉన్నవన్నీ సక్రమంగా జరిగితే.. బాలయ్య 102వ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. శ్రీకాంత్ కు ఆఫర్ చేసిన ఈ రోల్ పవర్ ఫుల్ గా మాత్రమే కాదు.. చాలా భయంకరంగా ఉంటుందట. శ్రీకాంత్ కూడా ఇప్పటికే ఈ రోల్ పై మనసు పడ్డాడని అంటున్నారు. కుటుంబ కథా చిత్రాలు.. పోలీస్ పాత్రలతో పాటు.. కామెడీ హీరోగా మెప్పించడంలో దిట్ట అయిన శ్రీకాంత్ కు.. విలన్ వేషాలు కొత్తేమీ కాదు.

తాజ్ మహల్ మూవీతో హీరో కాకముందు నెగిటివ్ పాత్రల్లోనే మెప్పించాడు శ్రీకాంత్. ఆ తర్వాత హీరోగా మారిన శ్రీకాంత్.. ఇప్పుడు బాబాయ్ పాత్రల్లోను మెరుస్తున్నాడు. గోవిందుడు అందరివాడేలే చిత్రంలో రామ్ చరణ్ కు.. సరైనోడులో అల్లు అర్జున్ కు బాబాయ్ గా నటించాడు. కెరీర్ తొలినాళ్లలో బాలయ్యకు ప్రత్యర్ధి పాత్రలు చేసిన శ్రీకాంత్ కు.. మళ్లీ ఇప్పుడు అలాంటి ఆఫర్ రావడం విశేషం కాగా.. ఇప్పుడు లీడ్ విలన్ రోల్ కేరక్టర్ దక్కుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/