Begin typing your search above and press return to search.

మహేష్ జోక్ చేశాడు.. అందరినీ కలుస్తా-అడ్డాల

By:  Tupaki Desk   |   19 May 2016 9:00 PM IST
మహేష్ జోక్ చేశాడు.. అందరినీ కలుస్తా-అడ్డాల
X
‘‘శ్రీకాంత్ అడ్డాలది ప్యూర్ హార్ట్. అతను ఇండస్ట్రీలో ఎవరితోనూ కలవడు. తన పనేదో తాను చేసుకుపోతుంటాడు. అందుకే అంత స్వచ్ఛంగా ఉంటున్నాడు’’.. బ్రహ్మోత్సవం ఆడియో వేడుకలో.. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలివి. ఇండస్ట్రీ జనాలతో కలిస్తే పాడైపోతారా అంటూ ఈ వ్యాఖ్యలపై చాలామంది సెటైర్లు వేశారు. ఇంకొందరు వాస్తవమే కదా అనుకున్నారు.

ఐతే శ్రీకాంత్ అడ్డాల మాత్రం మహేష్ జస్ట్ జోక్ చేశాడు అంతే అంటున్నాడు. తాను ఇండస్ట్రీ జనాలతో కలుస్తానని చెప్పాడతను. ‘‘ఎవరితోనూ కలవను అన్నది మహేష్ గారు జోక్ గా చెప్పిన మాట. నేను అందరినీ కలుస్తుంటాను. ఇండస్ట్రీ జనాలతో కలవకూడదన్న అభిప్రాయం ఏమీ లేదు’’ అని శ్రీకాంత్ అన్నాడు. ఇంకా కారు కొనుక్కోకపోవడం గురించి చెబుతూ.. ‘‘సింపుల్ గా బతకడం నాకిష్టం. అందుకే బైక్ మీదే తిరుగుతుంటా. అంతే తప్ప కారు కొనుక్కోకపోవడానికి వేరే కారణాలేమీ లేవు’’ అని శ్రీకాంత్ స్పష్టం చేశాడు.

ఐతే తన సినిమాల షూటింగ్ టైంలో మాత్రమే తాను హైదరాబాద్ లో ఉంటానని.. మిగతా సమయాల్లో తన సొంతూరు రేలంగిలో గడపడానికే ఇష్టపడతానని శ్రీకాంత్ చెప్పాడు. ‘‘సినిమా పూర్తవగానే నేరుగా మా ఊరికే వెళ్లిపోతుంటా. అక్కడే రెండు మూడు నెలలు గడుపుతా. చాలా వరకు నా కథలన్నీ అక్కడే తయారవుతాయి’’ స్క్రిప్ట్ ఓకే అయ్యాక హైదరాబాద్ వస్తాను’’ అని శ్రీకాంత్ వెల్లడించాడు.