Begin typing your search above and press return to search.

శంకర్ మూవీలో శ్రీకాంత్ ను గుర్తుపట్టలేమా?!

By:  Tupaki Desk   |   24 Jan 2022 3:37 AM GMT
శంకర్ మూవీలో శ్రీకాంత్ ను గుర్తుపట్టలేమా?!
X
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, హీరోగా తనని తాను నిరూపించుకున్న వారిలో శ్రీకాంత్ కూడా ఒకరిగా కనిపిస్తాడు. చాలా వేగంగా 100 సినిమాలను పూర్తి చేసినవారాయన. కెరియర్ తొలినాళ్లలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను పోషించిన ఆయన, ఆ తరువాత హీరోగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు. ఆ తరువాత ఆ స్టార్ డమ్ ను సుదీర్ఘకాలం పాటు నిలబెట్టుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మద్దతును మూటగట్టుకుని అదే దారిలో ఆయన ముందుకు వెళ్లాడు. డాన్స్ .. ఫైట్స్ విషయంలోను తనకి తిరుగులేదనిపించుకున్నాడు.

అప్పట్లో ఆయన హెయిర్ స్టైల్ .. వాకింగ్ స్టైల్ యూత్ కి విపరీతంగా నచ్చేసింది. చాలావరకూ ఆయన తన కెరియర్లో హిట్లనే సొంతం చేసుకున్నాడు. అలాగే మల్టీ స్టారర్ సినిమాలను కూడా చేస్తూ వచ్చాడు. ఇక మారుతున్న కాలంతో పాటు తన వయసుకి తగిన పాత్రలను చేయడానికీ .. విలన్ గా కనిపించడానికి కూడా ఆయన వెనుకాడటం లేదు. ఇటీవల వచ్చిన 'అఖండ' సినిమాలో విలన్ గాను ఆయన ఎక్కువ మార్కులు కొట్టేశాడు. పవర్ఫుల్ విలన్ పాత్రలను చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను పంపించాడు.

ఇక మరో వైపున ముఖ్యమైన .. కీలకమైన పాత్రలను చేయడానికి కూడా ఆయన ఉత్సాహాన్ని చూపుతున్నాడు. అలా ఆయన లైన్లో పెట్టేసిన సినిమాల్లో శంకర్ సినిమా కూడా ఉంది. చరణ్ కథానాయకుడిగా శంకర్ ఒక భారీ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వాని కనిపించనుండగా, ఒక ముఖ్యమైన పాత్రలో శ్రీకాంత్ కనిపించనున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు కూడా.

"ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇంతవరకూ ఈ తరహా పాత్రను నేను చేయలేదు. నా పాత్రను శంకర్ గారు గొప్పగా డిజైన్ చేశారు. ఈ పాత్ర లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన ఈ పాత్రను డిజైన్ చేయించిన తీరును చూసి, నేనే ఆశ్చర్యపపోయాను. లుక్ పరంగా .. క్యారెక్టరైజేషన్ పరంగా తెరపై కొత్తగా కనిపిస్తాను. 'మనం చూస్తున్నది శ్రీకాంత్ నేనా?' అనే ఆశ్చర్యం ప్రేక్షకులకు కలిగేలా ఉంటుంది. ఇలాంటి ఒక పాత్రను చేసే అవకాశం నాకు లభించడం నిజంగా గొప్ప విషయంగా భావిస్తున్నాను. శంకర్ గారి డైరెక్షన్లో చేయాలనే ముచ్చట ఈ సినిమాతో తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.