Begin typing your search above and press return to search.
'అబ్బనీ తీయని' అంటున్న కొత్త జంట
By: Tupaki Desk | 27 March 2016 4:52 PM ISTమెగా ఫ్యామిలీలో అందరూ ఏ రేంజ్ డ్యాన్సర్లో మనకు తెలుసు. ఇప్పుడు వారింటికి అల్లుడుగా రాబోతోన్న కళ్యాణ్ కూడా మంచి డ్యాన్సర్ అని తెలుస్తోంది. మరోవైపు చిరు చిన్న కూతురు శ్రీజకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. పలు రకాల డ్యాన్సులను నేర్చుకున్న ఈమె.. కుటుంబ వేడుకల్లో మాత్రం తన ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటుందని అంటారు. ఇప్పుడు తన పెళ్లిలో.. కాబోయే భర్తతో కలిసి డ్యాన్స్ చేసేందుకు శ్రీజ సిద్ధమవుతోందట.
తెల్లారితే శ్రీజ-కళ్యాణ్ ల పెళ్లి అనగా.. బెంగళూరులోని చిరు ఫాం హౌజ్ లో ఓ సంగీత్ ఏర్పాటు చేశారు. దీనికి రూపకర్త పూర్తిగా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుస్తోంది. ఈ సంగీత్ లో వచ్చే పాటలన్నిటినీ బన్నీయే డిసైడ్ చేశాడట. చిరంజీవి - పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి సూపర్ హిట్ పాటలకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ డ్యాన్స్ చేయనున్నారట. అలనాటి పాటల నుంచి రీసెంట్ గా హిట్ అయిన బాపు గారి బొమ్మో వరకు రకరకాల పాటలను ఎంపిక చేశారని తెలుస్తోంది.
మెగాస్టార్ మూవీస్ లో మేటి అయిన జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని అబ్బ నీ తీయని దెబ్బ పాటకు... కొత్త జంట అయిన కళ్యాణ్-శ్రీజలు డ్యాన్ చేస్తారట. ఇద్దరూ సహజంగానే డ్యాన్సర్లు కావడంతో.. ఈ పాటకు విజిల్స్ పడ్డం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. వీటన్నిటికీ మించి చిరంజీవి - రామ్ చరణ్ లు కూడా కలసి ఒక పాటకు డ్యాన్స్ చేస్తారట.