Begin typing your search above and press return to search.

కృష్ణ అల్లుడి రూట్ లోనే మెగా అల్లుడు

By:  Tupaki Desk   |   30 Jun 2016 12:27 PM GMT
కృష్ణ అల్లుడి రూట్ లోనే మెగా అల్లుడు
X
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి టాలీవుడ్ లో హీరోలుగా సెటిల్ అయిన లిస్ట్ పెద్దదే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్- వరుణ్ తేజ్- అల్లు శిరీష్.. మెగా హీరోలుగా ఇంత పెద్ద లిస్ట్ ఉంది. ఇప్పుడు మెగాస్టార్ అల్లుడు కూడా సినిమాల్లోకి వచ్చేసేందుకు ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది.

మెగా మేనల్లుడుగా తేజు సెటిల్ అయిపోయాగ.. ఇప్పుడు మెగా అల్లుడు కూడా ప్రయత్నాలు ప్రారంభించాడట. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్.. హీరోగా అరంగేట్రం చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రియలిస్ట్ గా అమెరికాలో సెటిల్ అయిన ఈ కుర్రాడు.. రీసెంట్ గానే శ్రీజను వివాహం చేసుకున్నాడు. తాజాగా ఈమె నిర్మాతగా తన అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకోగా.. ఇప్పుడు శ్రీజ భర్త హీరో అయిపోవాలని అనుకుంటున్నాడట. మెగాభిమానుల అండ ఎలాగూ ఉంటుంది కాబట్టి.. అరంగేట్రం అంత కష్టం కాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.

ఇలా అల్లుడు ట్యాగ్ తో హీరో అవ్వాలనుకోవడంలో.. శ్రీజ భర్త కళ్యాణ్ మొదటి వాడు కాదు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా సుధీర్ బాబు వచ్చాడు. మొదట ఇబ్బందులు పడ్డా ఇప్పుడు హీరోగా సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ కూడా తన లక్ ని టాలీవుడ్ లో పరీక్షించుకోవాలని అనుకుంటున్నాడు. ట్యాలెంట్ ఉంటే సెటిల్ అవడం అంత కష్టం కాకపోవచ్చులే.