Begin typing your search above and press return to search.

దుర్గ‌మ్మ‌కు శ్రీజ దంప‌తుల పూజ‌లు

By:  Tupaki Desk   |   12 April 2016 11:26 AM GMT
దుర్గ‌మ్మ‌కు శ్రీజ దంప‌తుల పూజ‌లు
X
మెగాస్టార్ చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ దంపతులు మంగ‌ళ‌వారం విజయవాడ కనకదుర్గమ్మను ద‌ర్శించుకుని పూజ‌లు చేశారు. శ్రీజ‌-క‌ళ్యాణ్ దంప‌తులు వివాహ‌మ‌య్యాక తొలిసారిగా విజ‌య‌వాడ వ‌చ్చారు. పెళ్ల‌యిన వెంట‌నే ఈ ఇద్ద‌రు నూత‌న దంప‌తులు తిరుమ‌ల శ్రీవారిని సంద‌ర్శించుకున్నారు. తాజాగా ఇప్పుడు విజ‌య‌వాడ దుర్గ‌మ్మ స‌న్నిధికి వ‌చ్చారు. శ్రీజ వివాహం చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్నారై కళ్యాణ్‌తో గ‌త నెల 28న జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి అయిన తర్వాత తొలిసారిగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి వచ్చిన ఈ కొత్త దంపతులు అమ్మవారిని, స్వామిని కూడా దర్శించుకున్నారు.