Begin typing your search above and press return to search.

శ్రీ‌హ‌రికి జెరాక్స్ లా ఉన్నాడు!

By:  Tupaki Desk   |   1 Jun 2019 11:08 AM GMT
శ్రీ‌హ‌రికి జెరాక్స్ లా ఉన్నాడు!
X
రియ‌ల్ స్టార్ శ్రీ‌హ‌రి వార‌సుడు బ‌రిలో దిగుతున్నాడు అన‌గానే ప‌రిశ్ర‌మ‌లో అంతో ఇంతో అటెన్షన్ త‌ప్ప‌నిస‌రి. శ్రీ‌హ‌రి అంటే టాలీవుడ్ లో పెద్ద స్థాయి న‌టుడు. ఇండ‌స్ట్రీ అగ్ర హీరోల సినిమాల్లో విల‌న్ గా .. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించారు. అటుపై హీరోగా మారి ఎంద‌రికో అన్నం పెట్టిన దేవుడ‌య్యాడ‌ని ఆయ‌న వ‌ద్ద ఉపాధి పొందిన వాళ్లు చెబుతుంటారు. శ్రీ‌హ‌రి వ‌ల్ల నిరంత‌రం ఫైట‌ర్స్ కి ఉపాధి ల‌భించేద‌ని.. ఆయ‌న చేసే యాక్ష‌న్ సినిమాల‌తో ఉపాధి పొందిన వాళ్లెంద‌రో ఆయ‌న్ని విప‌రీతంగా అభిమానిస్తారు. అందుకే మంచిత‌నం ఉన్న న‌టుడి కుటుంబం నుంచి ఒక కొత్త కుర్రాడు హీరో అవుతున్నాడు!! అన‌గానే అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

శ్రీ‌హ‌రి పెద్ద కుమారుడు మేఘాంశ్ శ్రీ‌హ‌రి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. `రాజ్ దూత్` అనేది టైటిల్. ఇటీవ‌లే ప్రీలుక్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ లుక్ కి స్పంద‌న బావుంది. తాజాగా ఫ్రంట్ ఎలివేష‌న్ తో మేఘాంశ్ శ్రీ‌హ‌రి లుక్ ని రివీల్ చేశారు. రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ కొత్త మోడ‌ల్ బైక్ మీద స్టైలిష్ గా క‌నిపిస్తున్నాడు. మేఘాంశ్ ఒడ్డు పొడ‌వు బావున్నాడు. తండ్రి శ్రీ‌హ‌రిని ప్ర‌తిబింబిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే జెరాక్స్ కాపీలానే ఉన్నాడు. అయితే నేటిత‌రం మోడ్ర‌న్ అప్పియ‌రెన్స్ అత‌డికి ప్ల‌స్ కానుంది. స్టైలిష్ లెద‌ర్ జాకెట్ .. డెనిమ్ జీన్స్.. లైట్ గా గ‌డ్డం.. నూనూగు మీసాలు .. అచ్చం డాడ్ కి రియ‌ల్ వార‌సుడిలా దూసుకొస్తున్నాడ‌నే అర్థ‌మ‌వుతోంది. మ‌రి అంత‌గా న‌ట‌న‌లోనూ విష‌యం చూపిస్తాడో లేదో చూడాలి.

`రాజ్ దూత్` చిత్రం పూర్తిగా యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్ అని తెలుస్తోంది. షూటింగ్ పూర్తయింది. కార్తీక్- అర్జున్ ద‌ర్శ‌క‌ద్వ‌యం ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ల‌క్ష్య ఫిలింస్ ప‌తాకంపై ఎం.ఎల్‌.వి స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్నారు. మేఘాంశ్ ఫ‌స్ట్ లుక్ ఆక‌ట్టుకుంది. వాస్త‌వంగానే అత‌డు ఛామింగ్ హీరో అని అర్థ‌మ‌వుతోంది. రియ‌ల్ సునామీలా దూసుకొస్తున్నాడా.. లేదా? అన్న‌ది తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కూ వేచి చూడాల్సిందే. అన్న‌ట్టు రాజ్ దూత్ - లిమిటెడ్ ఎడిష‌న్ అని అన్నాడు. కానీ అక్క‌డ రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ బైక్ క‌నిపిస్తోంది? దీనివెన‌క ఇంకేదైనా లాజిక్ ఉందా? నెక్ట్స్ టీజ‌ర్ వ‌స్తే కానీ తెలీదేమో!!