Begin typing your search above and press return to search.

శ్రీదేవి చిన్న కుమార్తె టాలీవుడ్ అరంగేట్రం

By:  Tupaki Desk   |   25 May 2021 3:30 PM GMT
శ్రీదేవి చిన్న కుమార్తె టాలీవుడ్ అరంగేట్రం
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాళ్ల టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ బాలీవుడ్ లో పెద్ద స్ట‌ర్ గా ఎదిగేస్తోంది. ఇప్పుడు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా తన వెండితెర రంగ ప్రవేశం కోసం సన్నద్ధమవుతోంది. ఖుషీ ఇటీవలే అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో నటనలో ఉన్నత విద్యను పూర్తి చేసి ముంబైకి తిరిగి వచ్చారు.

ఇప్పటికే ప్ర‌ముఖ‌ బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ ఖుషీ కోసం బిగ్ ప్లాన్ సిద్ధం చేశారు. తన త‌దుప‌రి ప్రొడ‌క్ష‌న్స్ లో ఖుషీని పరిచయం చేయబోతున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి.

మరోవైపు ఖుషీ తండ్రి .. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ టాలీవుడ్ లో కూడా ఖుషీని పరిచయం చేయడంపై ఆసక్తి కనబరుస్తున్నారని ప‌లువురు అగ్ర దర్శకులు ప్రొడక్షన్ హౌస్ లతో చర్చలు జరుపుతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఖుషీ నటనపై కపూర్ కుటుంబం అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సి ఉంటుంది.