Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: హాటు హాటు కపుల్

By:  Tupaki Desk   |   28 Feb 2017 12:30 AM IST
ఫోటో స్టోరి: హాటు హాటు కపుల్
X
బాలీవుడ్ లో హాట్ కపుల్ అంటే ఎవరు? ఖచ్చితంగా ఎవరైనా కూడా షాహిద్ కపూర్ అండ్ మీరా రాజ్పుత్.. లేదా సైఫ్‌ అండ్ కరీనా కపూర్.. ఇలా చాలా పేర్లే చెబుతారు. అయితే చాన్నాళ్ల తరువాత ఆ ట్రోఫీని వారి దగ్గర నుండి లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది సీనియర్ నటి శ్రీదేవి. అమ్మడు వయస్సులో ఉన్నప్పుడు ఇలా హాటుగా కనిపించేంత డిజైనర్ డ్రస్సులు లేవు. ఇప్పుడు అవి దొరికుతున్నాయ్ కాబట్టి.. శ్రీదేవి ఎక్కడా తగ్గట్లేదు.

అదిగో చూడండి.. అక్కడ అమ్మడు మొగుడు బోనీ కపూర్ తో కలసి ఎలాంటి ఫోజును ఇచ్చిందో. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్‌ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో అలా సొగసులు ఆరబోసింది ఈ సీనియర్ సోయగం. ఈ కాలం యూత్స్ లో చాలామందికి ఈ లుక్ తెగ నచ్చేసి అమ్మడు ఫోటోను తెగ ర్వీటీట్లు చేస్తూ వాట్సాప్ లో షేర్ చేసేస్తున్నారు. అయితే ఇదే ఈవెంట్లో శ్రీదేవి తన మరిది.. ఒకప్పుడు ఆన్ స్ర్కీన్ పై తనతో ఫెంటాస్టిక్ రొమాన్స్ పండించిన అనిల్ కపూర్ తో కూడా ఒక ఫోజిచ్చింది. దానిని కూడా హాట్ అంటున్నారు జనాలు. అది సంగతి.