Begin typing your search above and press return to search.

అత్త రెడ్డి పాత్రలో అతిలోక సుందరి??

By:  Tupaki Desk   |   21 Nov 2017 4:28 AM GMT
అత్త రెడ్డి పాత్రలో అతిలోక సుందరి??
X
హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకుని హ్యాపీగా మ్యారీడ్ లైప్ స్టార్ట్ చేసిన అక్కినేని హీరో నాగచైతన్య కొద్దిరోజుల పాటు సినిమాలకు విరామం ఇచ్చాడు. ఇప్పుడు తిరిగి షూటింగులపై దృష్టి పెట్టడం మొదలెట్టాడు. ముందుగా ప్రేమమ్ దర్శకుడు చందు మొండేటి డైరెక్షన్ లో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్ లో చేయడానికి ముందే పచ్చజెండా ఊపాడు. ఈ సినిమా టైటిల్ శైలజారెడ్డి అల్లుడు అని మారుతి ముందుగానే అనౌన్స్ చేశాడు.

ప్రస్తుతం సవ్యసాచి షూటింగ్ జరుగుతుండగా.. శైలజారెడ్డి అల్లుడు మూవీకి సంబంధించి యాక్టర్లను ఎంపిక చేస్తున్నారు. ఈ సినిమాలో అత్యంత ప్రధానమైన అత్త పాత్రకు రమ్యకృష్ణను తీసుకుంటారని ముందు టాక్ వచ్చింది. అయితే డైరెక్టర్ మారుతి మాత్రం ఈ రోల్ అతిలోక సుందరి శ్రీదేవితో చేయించాలని అనుకుంటున్నాడట. శైలజారెడ్డి పాత్ర శ్రీదేవి చేస్తే సినిమాకు బాగా క్రేజ్ రావడంతోపాటు ఇతర భాషల్లోకి డబ్ చేయడం చాలా సులువవుతుందనే ఆలోచనలో ఉన్నాడని అతడి సన్నిహితులు అంటున్నారు. ఈ పాత్రకు ఒప్పించే బాధ్యత నాగార్జున భుజాలపైనే పెట్టినట్టు తెలుస్తోంది.

శ్రీదేవి తిరిగి సినిమాల్లో నటించడం మొదలు పెట్టినా ఇంతవరకు తెలుగు మూవీ ఏదీ చేయలేదు. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర చేయమని అడిగితే సవాలక్ష కండిషన్లు పెట్టిందని అప్పట్లో రాజమౌళి చెప్పుకొచ్చాడు. తమిళంలో మాత్రం విజయ్ హీరోగా నటించి పులి సినిమాలో నటించింది. మరి ఇప్పుడు నాగచైతన్య సినిమా చేస్తుందా.. లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. శ్రీదేవి అక్కినేని వంశంలో నాగేశ్వరరావు - నాగార్జున ఇద్దరితోనూ హీరోయిన్ గా నటించింది. మరి మూడోతరంలో హీరోతో నటిస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.