Begin typing your search above and press return to search.

కోట్లకు సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ థియేట్రికల్ రైట్స్..!

By:  Tupaki Desk   |   14 Aug 2021 4:29 PM GMT
కోట్లకు సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ థియేట్రికల్ రైట్స్..!
X
టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు - ఆనంది జంటగా నటిస్తున్న సినిమా ''శ్రీదేవి సోడా సెంటర్''. 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 27న ఈ సినిమాని గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ - సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ నేపథ్యంలో సినిమాకు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా ఆల్ ఇండియా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ 12 కోట్లకు ఈ హక్కులను సొంతం చేసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న ఈ సినిమాను వీలైనంత వరకు భారీగానే రిలీజ్ చేసేందుకు లక్ష్మణ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై బ్లాక్‌ బస్టర్ విజయాన్ని అందుకున్న 'జాతి రత్నాలు' చిత్రాన్ని లక్ష్మణ్ డిస్ట్రిబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా, 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాలో లైటింగ్ సూరిబాబుగా సుధీర్ బాబు.. సోడాల శ్రీదేవిగా ఆనంది కనిపించనున్నారు. ఇందులో పావెల్ నవగీతన్ - నరేష్ - సత్యం రాజేష్ - రఘుబాబు - అజయ్ - హర్షవర్ధన్ - సప్తగిరి - రోహిణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సంగీత బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.