Begin typing your search above and press return to search.

మెగా డాటర్ డెబ్యూ మూవీ 'శ్రీదేవి శోభన్ బాబు' ఫస్ట్ లుక్..!

By:  Tupaki Desk   |   21 Aug 2021 6:35 AM GMT
మెగా డాటర్ డెబ్యూ మూవీ శ్రీదేవి శోభన్ బాబు ఫస్ట్ లుక్..!
X
మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి సుష్మిత 'గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్టైన్మెంట్స్' అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని నిర్మించింది. ఈ క్రమంలో ఇప్పుడు ''శ్రీదేవి శోభన్ బాబు'' అనే టైటిల్ తో ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ని నిర్మిస్తున్నారు.

రేపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈరోజు శనివారం ''శ్రీదేవి శోభన్ బాబు'' సినిమా టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. 'ఏక్ మినీ కథ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంతోష్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో 'జాను' ఫేమ్ గౌరీ కిషన్ హీరోయిన్. ప్రశాంత్ కుమార్ దిమ్మల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా విడుదలైన 'శ్రీదేవి శోభన్ బాబు' ఫస్ట్ లుక్ పోస్టర్ లో బ్యాగ్రౌండ్ లో ఓ ఇల్లు పెయింటింగ్ కనిపిస్తుండగా.. సంతోష్ - గౌరీ ఒకరినొకరు ప్రేమగా దగ్గరకు తీసుకొని ఉన్నారు. గౌరీ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో ఉండగా.. సంతోష్ మాత్రం ఫార్మర్ షర్ట్ లో రఫ్ గడ్డంతో మిడిల్ క్లాస్ యువకుడిగా కనిపిస్తున్నాడు. మరి ఈ శ్రీదేవి - శోభన్ బాబు ల కథ ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

'శ్రీదేవి శోభన్ బాబు' చిత్రానికి సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణులు వంటి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విష్ణు ప్రసాద్ - సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రి చిరంజీవికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా వర్క్ చేసిన మెగా డాటర్ సుష్మిత.. ప్రొడ్యూసర్ గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.