Begin typing your search above and press return to search.

శ్రీదేవి రెండో కుమార్తె లాంచింగ్ తేదీ ఫిక్స్

By:  Tupaki Desk   |   28 Jan 2021 10:00 PM IST
శ్రీదేవి రెండో కుమార్తె లాంచింగ్ తేదీ ఫిక్స్
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ఇహ‌లోకం నుంచి అంత‌ర్ధానం అయినా.. త‌న వార‌సురాళ్లు తాను లేని లోటు తీరుస్తార‌ని అభిమానులు న‌మ్మారు. తొలిగా `ధ‌డ‌క్` చిత్రంతో పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్ రంగ ప్ర‌వేశం చేసింది. ప్ర‌స్తుతం జాన్వీ లో ప‌రిణ‌తి కానీ కెరీర్ షేప‌ప్ అవుతున్న తీరు కానీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. బాలీవుడ్ లో వ‌రుస అవ‌కాశాల‌తో స‌త్తా చాటుతూ ఈ స్టార్ కిడ్ కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది.

అయితే జాన్వీ సోద‌రి .. శ్రీ‌దేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ రంగ ప్ర‌వేశం ఎపుడు? అన్న‌దానికి ఇన్నాళ్లు స‌రైన ఆన్స‌ర్ లేదు. పెద్ద ప్ర‌క‌ట‌న చేస్తాం! అని ఊరించిన బోనీ క‌పూర్ కూడా ఏదీ క్లారిటీగా చెప్ప‌లేదు.

కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం.. బోనీ మైండ్ ని ఖుషీ కెరీర్ ఆలోచ‌న చెద‌పురుగులా తినేస్తోంద‌న్న గుట్టు లీకైంది. ఖుషీ కపూర్ వచ్చే ఏడాది లాంచ్ అవుతుంద‌ని ఆ మేర‌కు బోనీ ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లతో సిద్ధంగా ఉన్నాడ‌ని ఓ గుస‌గుస వినిపిస్తోంది.

ఖుషీ క‌పూర్ ప్రస్తుతం యుఎస్ లో నటనలో శిక్షణ తీసుకుంటోంది. అభిన‌యం ఆంగికం.. వాచ‌కం.. డ్యాన్స్ ఇలా అన్నిటా ప‌క్కాగా త‌ర్ఫీదు పొందుతోంద‌ట‌. అంతా సజావుగా సాగితే.. ఖుషీ కపూర్ తొలి చిత్రం గురించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని తెలిసింది. ఒక‌వేళ బ‌రిలో దిగితే అక్క‌ను మించిన చెల్లి అనిపించుకుంటుందా? శ్రీ‌దేవి పేరు ఎంత‌వ‌ర‌కూ నిల‌బెడుతుంది? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్.