Begin typing your search above and press return to search.

కర్వా చౌత్ సందడంతా శ్రీదేవి దగ్గరే

By:  Tupaki Desk   |   20 Oct 2016 5:00 PM IST
కర్వా చౌత్ సందడంతా శ్రీదేవి దగ్గరే
X
నార్త్ ఇండియాలో కర్వా చౌత్ పండుగకు బోలెడంత ఇంపార్టెన్స్ ఉంటుంది. పెళ్లయిన ఆడవాళ్లంతా తప్పనిసరిగా చేసుకునే పెద్ద పండుగ ఇది. మరి ఈ పండుగకు అతిలోక సుందరి ఎలా జరుపుకుంది? బేసిక్ గా దక్షిణాది భామ అయినా శ్రీదేవి ఇప్పుడు పక్కా నార్త్ ఇండియన్ గా మారిపోయిందనడంలో సందేహం అక్కర్లేదు.

బాలీవుడ్ సెలబ్రిటీల భార్యలందరూ ఒక చోటకు చేరి ఈ కర్వాచౌత్ ను జరిపేసుకున్నారు. ఆ స్పాట్ లో చాలామంది ఉన్నారు కానీ.. అందరిలోకీ శ్రీదేవి తన మేని ఛాయతోనే ఓ రేంజ్ లో డామినేట్ చేసి పారేసింది. రెడ్ కలర్ కాంజీవరం చీర.. అంతకు మించి ఆమె అందాన్ని ఇనుమడింప చేస్తున్న బంగారం ఆభరణాలు.. శ్రీదేవిని చూడముచ్చటగా మార్చేశాయి. అచ్చమైన భారతీయ సాంప్రదాయ నారి అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ లా కనిపించింది శ్రీదేవి. ఈమెతో పాటు తన ఫ్రెండ్స్ అయిన సునీతా కపూర్ - మెహీప్ కపూర్ - రవీనా టాండన్ - నీలం కొఠారి - భావనా పాండే - తేజస్విని కొల్హపురి - రీమా జైన్ లు కూడా ఫోటోలు ఉన్నారు.

ఇంతకీ.. ఈ కర్వాచౌత్ లో శ్రీదేవి అందాన్ని అందరికీ చూపించింది ఎవరో తెలుసా? సోనమ్ కపూర్ తల్లి సునీతా కపూర్.. సోషల్ నెట్వర్క్ సైట్లో ఈ ఫోటో షేర్ చేయగానే.. వైరల్ గా మారిపోయి షేర్ అయిపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/